న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన కపిల్ సిబాల్ ఆగస్టు 8, 1948న పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించారు. 1973లో ఐఏఎస్‌కు ఎంపికైననూ న్యాయశాస్త్రంవైపే మొగ్గుచూపి న్యాయశాస్త్రంలో పేరుపొందారు. 1989-90 కాలంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా, 1995–96, 1997–98 & 2001–2002 కాలంలో సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. తర్వాత రాజకీయాలలో ప్రవేశించి కేంద్రంలో పలు మంత్రిత్వశాఖలను నిర్వర్తించారు. 2016లో తీసిన హిందీ సినిమా షోర్గుల్‌లో కపిల్ సిబాల్ పాటలు రాశారు. కపిల్ సిబాల్ 2006లో భారతప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారం పొందారు రాజకీయ ప్రస్థానం: 1998లో తొలిసారిగ్ రాజ్యసభకు బీహార్ నుంచి ఎన్నికయ్యారు. 2004, 2009లలో ఢిల్లీలోని చాందినీచౌక్ నియ్జకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికై 2004-14 కాలంలో మన్‌మోహన్ సింగ్ మంత్రివర్గంలో స్థానం పొందారు. ఈ కాలంలో శాస్త్రసాంకేతిక శాఖ మంత్రిగా, మానవ వనరుల శాఖ మంత్రిగా, సమాచార ప్రసార శాఖ మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో చాందినీచౌక్ నుంచే పోటీచేసి భాజపాకు చెందిన హర్షవర్థన్ చేతిలో పరాజయం పొందడమే కాకుండా మూడోస్థానంలో నిలిచారు. కుటుంబం: కపిల్ సిబాల్ కుంటుంబం దేశవిభజన సమయంలో పాకిస్తాన్ నుంచి భారత్ వలస వచ్చింది. కపిల్ సిబాల్ తండ్రి హెచ్.ఎల్.సిబాల్ పేరుపొందిన న్యాయవాది. 1994లో ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్‌చే Living Legend of the Lawగా కీర్తిపొందారు. సోదరుడూ కన్వల్ సిబాల్ దౌత్యవేత్త. ఇవి కూడా చూడండి:
= = = = =
|
25, ఆగస్టు 2020, మంగళవారం
కపిల్ సిబాల్ (Kapil Sibal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి