వాజేడు ములుగు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 7 ఎంపీటీసి స్థానాలు, 17 గ్రామపంచాయతీలు, 61 రెవెన్యూ గ్రామాలు కలవు. బొగత గ్రామంలో జలపాతం ఉంది. ఇది తెలంగాణ నయాగారగా పేరుపొందింది. మండలం పశ్చిమ సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. 2016కు ముందు ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ మండలం అక్టోబరు 11, 2016న జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేరింది. 2019లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాను విభజించి ములుగు జిల్లా ఏర్పాటు చేయడంతో ఈ మండలం ములుగు జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి దక్షిణాన వెంకటాపురం మండలం, పశ్చిమాన కన్నాయిగూడెం మండలం, నైరుతిన ఏటూరునాగారం మండలం, తూర్పున ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. మండలం పశ్చిమ సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. మండలం మీదుగా జాతీయ రహదారి నెం. 202 వెళ్ళుచున్నది.
జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 24853. ఇందులో పురుషులు 12241, మహిళలు 12612.
రాజకీయాలు:
ఈ మండలం భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన శ్యామల శారద, జడ్పీటీసిగా తెరాసకు చెందిన తల్లాది పుష్పలత ఎన్నికయ్యారు.
వాజేడు మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు: akshmipuram, angalapalle(G), Annavaram(G), Arlagudem (G), Arlagudem(Z), Aruguntapalle (G), Aruguntapalle (Z), Arunachalapuram, Ayyavaripeta (G), Ayyavaripeta (Z), Bhuvanapalle, Bijinepalle, Bollaram (Z), Bommanapalle(G), Chandrupatla (Z), Cheekupalle(Z), Cherukur (G), Cherukur (Z), Chinnagollagudem (Z), Chintoor (G), Chintoor (Z), Dharmavaram, Dulapuram (G), Edjarlapalle (G), Edjarlapalle (Z), Ghanpuram (Z), Ghattuveerapuram (Z), Gummadidoddi, G) Chaka, Gummadidoddi(Z), ingaper(Z), Kacharam (G), Kadekal (G), Kadekal (Z), Kongala (G), Koppusuru, Korakal (Z), Koyaveerapuram (G), Krishnapuram (G), Lalpet (G), Morumuru (G), Morumuru (Z), Mulkanapalle (G), Mutharam Chowk, Nagaram (G), Padigapuram (Z), Peddagangaram (Z), Peddagollagudem (Z), Peddagollagudem(G), Penugolu (G), Peruru (G), Peruru (Z), ppagudem (G), Pragallapalle (Z), Pusur (Z), Pusur patch - I, Pusur patch- II, Rampuram, Tekulagudem (Z), Tekulagudem Chak-II, Tekulagudem-Chak-I, Wazeed(G)
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
చీకుపల్లి (Cheekupally): చీకుపల్లి ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన గ్రామము. బొగత జలపాతం ఈ గ్రామసమీపంలో ఉంది. ఈ జలపాతం పర్యాటకంగా తెలంగాణ నయాగారగా ప్రసిద్ధి చెందింది.
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Vazedu or Wajedu Mandal in Telugu, Mulugu Dist (district) Mandals in telugu, Mulugu Dist Mandals in telugu,
Sir... Pls upload full detailed information about Mulugu District and Narayanpet District
రిప్లయితొలగించండి