8, ఆగస్టు 2020, శనివారం

రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh)

జననం
జూలై 10, 1951
రంగం
రాజకీయాలు
పదవులు
ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, భాజపా జాతీయ అధ్యక్షులు,
రాజకీయ పార్టీ
భారతీయ జనతాపార్టీ
భారతీయ జనతాపార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, భాజపా జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన రాజ్‌నాథ్ సింగ్ జూలై 10, 1951న ఉత్తరప్రదేశ్‌లోని భబౌరాలో రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించారు. విద్యార్థిదశ నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌తో సంబంధాలు కలిగియున్న రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభంలో భౌతికశాస్త్ర లెక్చరర్‌గా వృత్తిజీవితం ఆరంభించారు. ఆ తర్వాత జనసంఘ్ పార్టీ ద్వారా రాజకీయాలలో ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి భాజపా జాతీయ అధ్యక్షులుగా, కేంద్రమంత్రిగా పదవులు పొందారు. ప్రస్తుతం నరేంద్రమోడి మంత్రివర్గంలో రక్షణశాఖ మంత్రిగా ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం:
1975లో జనసంఘ్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన రాజ్‌నాథ్ సింగ్ 1984లో భాజపా యువవిభాగం రాష్ట్ర అధ్యక్షులుగా, 1988లో భాజపా యువమోర్చా జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైనారు. 1991లో కళ్యాణ్‌సింగ్ ముఖ్యమంత్రి కాలంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. ఆ తర్వాత 1994లో రాజ్యసభకు ఎన్నికైనారు. 2000లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి పొంది రెండేళ్ళు పనిచేశారు. 2003-04 కాలంలో అటల్ బిహారి వాజపేయి మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 2013-14 కాలంలో లాల్ కృష్ణ అద్వానీ తర్వాత భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షులుగా వ్యవహరించారు. 2014 నుంచి నరేంద్రమోడి మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఈయన కుమారుడు పంకజ్ సింగ్ కూడా రాజకీయాలలో కొనసాగుతున్నారు (ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే)
 
 
ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: భాజపా జాతీయ అధ్యక్షులు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు, ఉత్తరప్రదేశ్ ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక