తమిళ సినీనటుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రసిద్ధి చెందిన మరుథుర్ గోపాలన్ రామచంద్రన్ జనవరి 17, 1917న శ్రీలంకలోని కాండిలో జన్మించారు. ప్రారంభంలో నాటకాలలో పనిచేసి ఆ తర్వాత సినిమా రంగప్రవేశం చేశారు. సినిమాలలో ఉంటూనే రాజకీయాలలో కూడా స్థానం పొందారు. ఎమ్మెల్సీగా, శాసనసభ్యుడిగా విజయం సాధించి అన్నాదురై మరణం తర్వాత ఏఐఏడిఎంకె పార్టీని స్థాపించి పదేళ్ళపాటు తమిళనాడు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడే డిసెంబరు 24, 1987న చెన్నైలో మరణించారు. 1988లో మరణానంతరం ఈయనకు భారతరత్న పురస్కారం ప్రకటించబడింది. ఈయన మరణం తర్వాత మూడో భార్య జానకి రామచంద్రన్ కొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది. సినీ, రాజకీయ ప్రస్థానం: ప్రారంభంలో నాటకాలలో నటించి సినిమాలలో ప్రవేశించిన ఎంజీఆర్‌కు 1936లో సతీలీలావతి సినిమాలో చిన్న పాత్రద్వారా సినిమా అవకాశం లభించింది. 1940-70 కాలంలో ప్రముఖ తమిళ సినీనటుడిగా రాణించారు. 1972లో రిక్షాకరన్ సినిమాలో నటనకై జాతీయ ఫిలిం అవార్డు కూడా పొందారు. సినిమాలలో నటిస్తూనే కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయప్రవేశం చేశారు. ఆ తర్వాత అన్నాదురై ప్రభావానికి లోనై 1953లో డీఎంకె పార్టీలో చేరారు. 1962లో డిఎంకె తరఫున విధానమండలికి, 1967లో తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. 1968లో తోటినటుడు రాధాకృష్ణన్‌చే ఈయనపై హత్యాహత్నం జరిగింది. 1972లో అన్నాదురై మరణం తర్వాత కరుణానిధితో విబేధించి డిఎంకె నుంచి బయటకు వచ్చి ఏఐఏడిఎంకె పార్టీని స్థాపించారు. 1977లో ఏఐఏడిఎంకె ను విజయపథంలో నడిపించి ముఖ్యమంత్రి పదవిలో కూర్చుని ఈ ఘనత సాధించిన తొలి సినీనటుడిగా అవతరించారు. మధ్యలో కొంతకాలం మినహా 1987లో మరణించేవరకు ముఖ్యమంత్రిగా కొనసాగినారు. ఈయన మరణం తర్వాత మూడో భార్య జానకి రామచంద్రన్ కొంతకాలం పాటు ముఖ్యమంత్రిగా ఉండగా, ఆ తర్వాత జయలలిత ఏఐఏడిఎంకె పార్టీ అధ్యక్షురాలిగా, ఆ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా పనిచేసింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
4, సెప్టెంబర్ 2020, శుక్రవారం
ఎం.జి.రామచంద్రన్ (M.G. Ramachandran)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి