ప్రముఖ రాజకీయ నాయకుడిగా పేరుపొందిన ముత్తువేల్ కరుణానిధి జూన్ 3, 1924న తమిళనాడులోని తిరుకువలైలో జన్మించారు. కలైనర్‌గా ప్రసిద్ధి చెందిన కరుణానిధి ఓటమి లేకుండా 13 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నిక కావడమే కాకుండా 5 సార్లు ముఖ్యమంత్రిగా పదవి పొందారు. ప్రారంభంలో స్క్రీన్ రైటర్‌గా జీవనం ఆరంభించి, రాజకీయాలలో ప్రవేశించి శాసనసభ్యుడిగా, మంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా పదవులు పొంది మరణించేవరకు తమిళనాట తిరుగులేని నేతగా అవతరించారు. రచయితగా కరుణానిధి 100కు పైగా పుస్తకాలు కూడా రచించారు. సుధీర్ఘకాలం రాజకీయాలలో కొనసాగిన కరుణానిధి ఆగస్టు 7, 2018న చెన్నైలో మరణించారు. ఈయన కుమారులు స్టాలిన్, అలిగిరి, కూతురు కనిమొళి కూడా రాజకీయాలలో ఉన్నారు. స్టాలిన్ ప్రస్తుతం డిఎంకె పార్టీ అధ్యక్షపదవిలో ఉన్నారు. రాజకీయ ప్రస్థానం: విద్యార్థి దశలోనే జస్టిస్ పార్టీ వారి ప్రసంగాలు విని హిందీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న కరుణానిధి 1957లో తొలిసారిగా కులితలై నుంచి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనారు. 1962లో తంజావూరు నుంచి, 1967లో సైదాపేట్ నుంచి ఎన్నికై ప్రతిపక్ష డిప్యూటి లీడర్‌గా పనిచేశారు. 1969లో అన్నాదురై మరణం తర్వాత డిఎంకె పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడమే కాకుండా అదే ఏడాది తొలిసారి ముఖ్యమంత్రి పదవి పొందారు. 1972లో ఎం.జి.రామచంద్రన్ డిఎంకె నుంచి బయటకు వెళ్ళి ఏఐఏడిఎంకె ను స్థాపించడంతో ఈయనకు రామచంద్రన్‌కు మధ్య ముఖ్యమంత్రి పదవికి పోటీ ఏర్పడింది. రామచంద్రన్ మరణం తర్వాత ఏఐడిఎంకె అధ్యక్షపదవి పొందిన జయలలితతో కూడా ఈయనకు ముఖ్యమంత్రి పీఠం పలుమార్లు చేతులుమారింది. మొత్తంపై కరుణానిధి 5 సార్లు ముఖ్యమంత్రి పదవి పొందడమే కాకుండా (తమిళనాడు ముఖ్యమంత్రుల పట్టికకై ఇక్కడ చూడండి) తమిళనాడులో సుధీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. కుమారుడు స్టాలిన్‌ను ఈయన రాజకీయ వారసుడిగా ప్రకటించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
4, సెప్టెంబర్ 2020, శుక్రవారం
ఎం.కరుణానిధి (M. Karunanidhi)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి