11, అక్టోబర్ 2020, ఆదివారం

భారత రాజ్యాంగము (Indian Constitution)

అమలు తేది
జనవరి 26, 1950
రూపొందించినది
రాజ్యాంగ పరిషత్తు
రాజ్యాంగ చిహ్నం
ఏనుగు
రాజ్యాంగ పితామహుడు
అంబేద్కర్
భారతదేశ సర్వోన్నత చట్టంగా పేర్కొనబడే భారత రాజ్యాంగము జనవరి 26, 1950న అమలులోకి వచ్చింది. 1946లో ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తుచే రచించిబడ్డ రాజ్యాంగము నవంబరు 26, 1949న పూర్తిచేసుకొని 2 మాసాల అనంతరం అధికారికంగా అమలులోకి వచ్చింది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన దినాన్ని ఏటా రిపబ్లిక్ దినోత్సవంగా జర్పుకుంటున్నాము. ప్రారంభంలో 395 ప్రకరణలు, 8 షెడ్యూళ్ళు కల్గిన రాజ్యాంగానికి ఇప్పటివరకు 104 సార్లు సవరణలు జరిగాయి. కేంద్రంలో మరియు రాష్ట్రాలలో పాలన గురించి, రాజ్యాంగ పదవులలో ఉన్నవారి ఎన్నిక లేదా నియామకం, అధికారాలు, విధులు, బాధ్యతల గురించి, న్యాయస్థానాల పరిధి గురించి, అధికార విభజన గురించి రాజ్యాంగంలో వివరించబడ్డాయి. రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తులో ముఖ్యమైన డ్రాఫ్టింగ్ కమిటీకి అంబేద్కర్ అధ్యక్షత వహించారు. అంబేద్కర్‌ను భారత రాజ్యాంగ నిర్మాతగా వ్యవహరిస్తారు.

భారత రాజ్యాంగ చరిత్ర:
బ్రిటీష్ పాలన కాలంలో 1935 తర్వాత భారతదేశ పరిస్థితులలో వేగంగా మార్పులు వచ్చాయి. 1937లో వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడడం, రెండో ప్రపంచయుద్ధం సమయంలో ప్రభుత్వాల రాజీనామాలు, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం, అతివాదులు బలపడటం, మతకలహాలు, క్రిప్స్ మిషన్ విఫలం కావడం,  1946లో కేనీనెట్ మిషన్ భారత్ సందర్శించి స్వాతంత్ర్యం ఇవ్వాలని నిర్ణయించడం, 1946లోనే జనహర్ లాల్ నెహ్రూ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడటంతో రాజ్యాంగ రచన అనివార్యమైంది. దీనితో డిసెంబరు 6, 1946లో రాజ్యాంగ రచనకై రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుచేయడం జరిగింది.
 

రాజ్యాంగ ప్రవేశిక:
భారత రాజ్యంగ ప్రవేశిక క్రింది విధంగా ఉంది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో సామ్యవాద, లౌకిక పదాలు చేర్చబడ్డాయి.
భారత ప్రజలమైన మేము, భారత్‌ను సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచాలని, దేశ పౌరులందరికీ కింది అంశాలు అందుబాటులో ఉంచాలని సంకల్పించాము:
న్యాయం - సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం;
స్వేచ్ఛ - ఆలోచనా స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ, మతావలంబన స్వేచ్ఛ;
సమానత్వం - హోదాలోను, అవకాశాలలోను సమానత్వం;
సౌభ్రాతృత్వం - వ్యక్తి గౌరవం పట్ల నిష్ఠ, దేశ సమైక్యత సమగ్రతల పట్ల నిష్ఠ;
మా రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి, ఆమోదించి, మాకు మేము సమర్పించుకుంటున్నాము.


భారత రాజ్యాంగం లోని షెడ్యూళ్ళు:
భారత రాజ్యంగం ఆమోదం సమయంలో 8 షెడ్యూళ్ళు ఉండగా ప్రస్తుతం 12 షెడ్యూళ్ళు ఉన్నాయి. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9 వ షెడ్యూల్ ను చేర్చగా, 1985లో 52 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాలంలో 10 వ షెడ్యూల్ ను రాజ్యాంగంలో చేర్చారు. ఆ తర్వాత 1992లో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా 11, 12 వ షెడ్యూళ్ళను చేర్చబడ్డాయి.

1 వ షెడ్యూల్ → భారత సమాఖ్యలోని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు
2 వ షెడ్యూల్ → రాజ్యాంగ పదవులలో ఉన్నవారి జీతభత్యాలు
3 వ షెడ్యూల్ → ప్రమాణ స్వీకారాలు
4 వ షెడ్యూల్ → రాజ్యసభలో రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సీట్ల విభజన
5 వ షెడ్యూల్ → షెడ్యూల్ ప్రాంతాల పరిపాలన
6 వ షెడ్యూల్ → ఈశాన్య రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల పరిపాలన
7 వ షెడ్యూల్ → కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికార విభజన
8 వ షెడ్యూల్ → రాజ్యాంగం గుర్తించిన 22 భాషలు
9 వ షెడ్యూల్ → కోర్టుల పరిధిలోకి రాని కేంద్ర, రాష్ట్రాలు జారీ చేసిన చట్టాలు
10 వ షెడ్యూల్ → పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం
11 వ షెడ్యూల్ → గ్రామ పంచాయతిల అధికారాలు
12 వ షెడ్యూల్ → నగర పంచాయతి, పురపాలక సంఘాల అధికారాలు

భారత రాజ్యాంగ ముఖ్యమైన లక్షణాలు:
భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగంగా పేరుపొందింది. ప్రవేశికతో పాటు 450కిపైగా అధికరణాలు, 12 షెడ్యూళ్ళతో కూడిన బృహత్తరమైన చట్టం ఇది. ప్రజలందరికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఇస్తూ, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను కల్పిస్తూ, బలమైన కేంద్రంతో కూడిన సమాఖ్య వ్యవస్థను రూపొందించింది. పౌరులకు ప్రాథమిక హక్కులు, విధులు, ఆదేశ సూత్రాలు వివరించబడింది. కేంద్రంలో ద్విసభా విధానం కల్గి, దేశంలోని అన్ని ప్రధాన భాషలను అధికార భాషలుగా పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన సామాజిక వర్గాలకు రక్షణ కల్పించింది. అవసరమైనపుడు రాజ్యాంగాన్ని సవరించుకోడానికి వెసులుబాటు కలిగిస్తూ సవరణ విధానాన్ని కూడా నిర్దేశించింది.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: భారత రాజ్యాంగము,


 = = = = =



Tags: Generak Knowldge tables in Telugu, India GK in Telugu, --------------------------------- Tags: Indian Constitution in Telugu, ----------------------


మా CCKRao జనరల్ నాలెడ్ఝి సీరీస్ ప్రచురిత క్విజ్ పుస్తకాలు
పోస్టుద్వారా (పోస్టల్ చార్జీలు ఉచితం) మా CCKRao సీరీస్ క్విజ్ మరియు జనరల్ నాలెడ్జి పుస్తకాలు కాలవసినవారు ఇక్కడ చూడండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక