కామేపల్లి ఖమ్మం జిల్లాకు చెందిన మండలము. మండలంలో 12 ఎంపీటీసి స్థానాలు, 24 గ్రామపంచాయతీలు, 13 రెవెన్యూ గ్రామాలు కలవు. తెలంగాణ పోరాటయోధుడు, సీనియర్ పాత్రికేయుడు ఆదిరాజు వెంకటేశ్వరరావు, 2009, 2014లలో పాలేరు నుంచి శాసనసభకు ఎన్నికైన మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఈ మండలానికి చెందినవారు. భౌగోళికం, సరిహద్దులు:
ఈ మండలానికి ఉత్తరాన సింగరేణి మండలం, తూర్పున ఎన్కూరు మండలం, దక్షిణాన రఘునాథపాలెం మండలం, పశ్చిమాన మహబూబాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండలం మీదుగా కాజీపేట-విజయవాడ రైలుమార్గం వెళ్ళుచున్నది. జనాభా: 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 41959. ఇందులో పురుషులు 20875, మహిళలు 21084. రాజకీయాలు: ఈ మండలము యెల్లందు అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు సుజాతానగర్ నియోజకవర్గంలో ఉండేది. 2009, 2014లలో పాలేరు నుంచి శాసనసభకు ఎన్నికైన రాంరెడ్డి వెంకటరెడ్డి ఈ మండలానికి చెందినవారు. 2019 స్థానిక ఎన్నికలలో మండల అధ్యక్షులుగా తెరాసకు చెందిన బానోత్ సునీత ఎన్నికయ్యారు.
కామేపల్లి మండలంకై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి. మండలంలోని గ్రామాలు:Garidepally, Govindrala, Jasthipally, Kamepally, Kommenapally, Kondaigudem, Lingala, Maddulapally, Mucharla, Nemalipury, Pinjaramadugu, Ponnekal, Utkoor
ప్రముఖ గ్రామాలు: లింగాల (Lingal):లింగాల ఖమ్మం జిల్లా కామేపల్లి మండలమునకు చెందిన గ్రామము. రాష్ట్రమంత్రిగా పనిచేసిన రాంరెడ్డి వెంకటరెడ్డి స్వగ్రామం. ఇవి కూడా చూడండి:
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kamepalli Mandal in Telugu, Khammam Dist (district) Mandals in telugu, Khammam Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి