24, నవంబర్ 2020, మంగళవారం

తరుణ్ గొగోయ్ (Tarun Gogoi)

జననం
ఏప్రిల్ 1, 1936
రంగం
రాజకీయాలు
పదవులు
కేంద్రమంత్రి, అస్సాం ముఖ్యమంత్రి,
మరణం
నవంబరు 23, 2020
అస్సాంకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన తరుణ్ గొగోయ్ ఏప్రిల్ 1, 1936న జోర్హట్ సమీపంలోని రంగహటిలో జన్మించారు. మున్సిపల్ బోర్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించి 4 సార్లు, ఎమ్మెల్యేగా, 6 సార్లు ఎంపీగా, అస్సాం పిసిసి అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా, అస్సాం ముఖ్యమంత్రిగా పదవులు పొందారు. నవంబరు 23, 2020న గౌహతిలో మరణించారు. ఈయన కుమారుడు గౌరవ్ గొగోయ్ కూడా రాజకీయ నాయకుడు.

రాజకీయ ప్రస్థానం:
తరుణ్ గొగోయ్ 1968లో జోర్హట్ మున్సిపల్ బోర్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ఆరంభించారు. 1971లో జోర్హట్‌ నుంచి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికైనారు. 1976లో ఇందిరాగాంధీ హయంలో ఏఐసిసి జాయింట్ సెక్రటరీగా నియమించబడ్డారు. ఆ తర్వాత 1977లో రెండోసారి లోక్‌సభకు ఎనికయ్యారు. మొత్తం 4 సార్లు రాష్ట్ర శాసనసభకు, 6 సార్లు లోక్‌సభకు ఎన్నికైన తరుణ్ గొగోయ్ 1991-96 కాలంలో పి.వి.నరసింహారావు మంత్రివర్గంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. రాజీవ్ గాంధీల హయంలో ఏఐసిసి జనరల్ సెక్రటరీగా పార్టీ పదవులు నిర్వహించారు. 2001-16 కాలంలో 3 వరుస పర్యాయాలు అస్సాం ముఖ్యమంత్రిగా సుధీర్ఘకాలం పనిచేశారు.
 
 
ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: అస్సాం ముఖ్యమంత్రులు, అస్సాం ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక