అస్సాం ఈశాన్య భారతదేశానికి చెందిన రాష్ట్రము. రాష్ట్ర రాజధాని డిస్పూర్, పెద్ద పట్టణం గౌహతి మరియు అధికార భాష అస్సామి. ఈశాన్య రాష్ట్రాలలో ఇదే పెద్ద రాష్ట్రము. ప్రఖ్యాతిగాంచిన కామాఖ్య దేవాలయం, నహర్ కాటియా చమురుక్షేత్రం, అతిపెద్ద నదీద్వీపం మజులీ, కాజీరంగా జాతీయపార్కు, మానస్ అభయారణ్యం అస్సాంలో ఉన్నాయి. దేశంలో తేయాకు పంటకు ఈ రాష్ట్రం ప్రసిద్ధి చెందింది. అస్సాం ప్రజలకు ముఖ్యమైన పండుగ బిహు. బ్రహ్మపుత్ర నది అస్సాంలో ప్రవహించే ముఖ్యమైన నది. భారతరత్న పురస్కారం పొందిన గోపీనాథ్ బోర్దోలాయ్, బ్యాడ్మింటన్ క్రీడాకారుడు దీపంకర్ భట్టాచార్జీ, సంగీత దర్శకుడు భూపేన్ హజారికా, ప్రముఖ రచయిత్రి ఇందిరా గోస్వామి అస్సాంకు చెందినవారు. భౌగోళికం: భౌగోళికంగా అస్సాం ఈశాన్య భారతదేశంలో ఆంగ్ల అక్షరం "T" ఆకారంలో ఉంది. రాష్ట్ర వైశాల్యం 78,438 చకిమీ (దేశంలో 16వ స్థానం) మరియు 2011 ప్రకారం జనాభా 3.11 కోట్లు (దేశంలో 15వ స్థానం). పశ్చిమబెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ రాష్ట్రాలు మరియు భూటాన్, బంగ్లాదేశ్ దేశాలను సరిహద్దులుగా కల్గియుంది. భౌగోళికంగా అస్సాంను బరక్ వాలీ, బ్రహ్మపుత్ర వాలీ అని రెండు భాగాలుగా విభజించవచ్చు. గౌహతి, సిల్చార్, దిబ్రూగర్, జోర్హట్, తేజ్‌పూర్ అస్సాంలోని ప్రధాన నగరాలు చరిత్ర: ప్రాచీన కాలంలో అస్సాం కామరూపగా, ప్రాగ్‌జ్యోతిషాపురంగా పిల్వబడింది. కామరూప కేంద్రంగా నరకాసురుడు పాలించినట్లుగా చరిత్రక కథనం. సముద్ర గుప్తుడి శాసనంలో కూడా కామరూప ప్రస్తావన ఉంది. 1826లో మొదటి ఆంగ్లో-బర్మా యుద్ధం తర్వాత అస్సాం బ్రిటీష్ వారి అధీనంలోకి వచ్చింది. బ్రిటీష్ పాలనలోకి రావడానికి ముందు అస్సాంను అహోమ్ రాజులు పాలించారు. 1826లో యాండబు సంధి ప్రకారం బర్మీయులు అస్సాం నుంచి వైదొలిగారు. బ్రిటీష్ ఇండియా కాలంలో 1874లో ప్రత్యేక అస్సాం ప్రావిన్సు ఏర్పడింది. దేశ విభజన సమయంలో అస్సాంలోని ముస్లిం మెజారిటీ కల సిల్హెట్ జిల్లా పాకిస్తాన్ (ఇప్పటి బంగ్లాడ్)కు బదిలీ అయింది. స్వాతంత్ర్యానంతరం అస్సాం రాష్ట్రం అనేక ప్రాంతాలు విడిపోయి ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి. ఆర్థికం: తేయాకు పంటకు ఈ రాష్ట్రం దేశంలోనే ప్రసిద్ధి చెందింది. పెట్రోలియం నిక్షేపాలు అస్సాంలో అధికంగా ఉన్నాయి. దేశంలోనే తొలి చమురుబావి దిగ్బాయ్ అస్సాంలోనే బయటపడింది. నహర్‌కాటియ్ చమురు క్షేత్రం కూడా ఈ రాష్ట్రంలో ఉంది. నామరూపలో ఎరువుల కార్మాగారం, నూనమతిలో చమురుశుద్ధి కర్మాగారం ఉన్నాయి. ఇవి కూడా చూడండి:
= = = = =
|
8, సెప్టెంబర్ 2020, మంగళవారం
అస్సాం (Assam)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి