హైదరాబాదు మహానగరపాలక సంస్థకు డిసెంబరు 1, 2020న ఎన్నికలు జరిగాయి. పాలకవర్గం గడుపు ఫిబ్రవరి వరకు ఉన్ననూ ముందస్తుగా ఎన్నికలు నిర్వహించారు. డిసెంబరు 4న ఓట్ల లెక్కింపు జరిగింది. 150 డివిజన్లకుగాను తెరాస 55, భాజపా 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలలో విజయం సాధించాయి. భారతీయ జనతాపార్టీ 4 స్థానాల నుంచి ఏకంగా 12 రెట్లతో లబ్దిపొంది 48 స్థానాలలో విజయం సాధించడం రాష్ట్ర రాజకీయాలలోనే సంచలనం సృష్టించింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గత ఎన్నికలలో పొందిన 99 స్థానాల నుంచి 55 స్థానాలకు పడిపోవడం జరిగింది. ఎంఐఎం మరియు కాంగ్రెస్ పార్టీ స్థానాలలో అంతగా మార్పులేదు. ఈ ఎన్నికకు ముందు జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా సాధించిన సంచలన విజయం ఈ ఎన్నికలలో కూడా కొనసాగినట్లుగా చెప్పవచ్చు. భాజపాకు మెజారిటీ స్థానాలు, మేయర్ స్థానం లభించకున్ననూ సాధించిన 48 స్థానాలలో అత్యధిక స్థానాలు తెరాస సిటింగ్ స్థానాలు కావడం అందులోనూ ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలలో తెరాస ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం. పలువులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇంచార్జీలుగా పనిచేసి కూడా తెరాసకు విజయం దక్కలేదు. ఉప్పల్ డివిజన్‌లో తెరాస అభ్యర్థి ఉప్పల్ ఎమ్మెల్యే భార్య ఓడిపోవడం కూడా సంచలనమే. ఎప్పటిలాగే నగరంలో ఓటింగ్ శాతం స్వల్పంగానే ఉంది. హోరాహోరీగా ప్రచారం సాగించిననూ ప్రజలలో ఆసక్తి లేదనడానికి స్వల్ప పోలింగ్ శాతమే నిదర్శనం. ఈ ఎన్నికలలో తెరాస ఓటమికి కారణాలు: 1) నగరంలో ఉద్యోగులు చాలా అధికంగా ఉన్నారు. కాని ఉద్యోగులకు తెరాసపై తీవ్ర నిరాశ ఉండటంతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకగా ఓటువేశారు. పోస్టల్ ఓట్ల లెక్కింపులో భాజపా 92 స్థానాలలో మెజారిటీ పొందడం దీనికి తిరుగులేని నిదర్శనం. ఉద్యోగులకు ప్రతి ఐదేళ్లకోసారి ప్రకటించే వేతన స్థిరీకరణ ప్రకటించకపోవడం, కనీసం ఐఆర్ కూడా విడుదల చేయకపోవడం, ప్రతి 6 మాసాలకు రావాల్సిన డిఏ బకాయిలు క్రమంగా చెల్లించకపోవడం, లాక్‌డౌన్ సమయంలో 3 మాసాలు సగం జీతాలే ఇవ్వడం, మిగితా సగం జీతాలకై వాయిదాలు ఇంకనూ పూర్తిగా అందకపోవడం తదితరాలు ఉద్యోగులు తెరాసకు వ్యతిరేకంగా ఓటువేయడానికి కారణమైనాయి. 2) ఎన్నికలకు ముందు వరదసహాయం రూ 10వేలు చెల్లింపునకు హైకోర్టు నిరాకరించడంతో ప్రజలలో తీవ్ర నిరాశ ఏర్పడింది. ఎనికలకు ఇంకనూ సమయం ఉన్ననూ వరద సహాయం చెల్లింపు వాయిదాకై ఎన్నికలు హుటాహుటినా పెట్టారనే అభిప్రాయం మరియు అపోహ ప్రజలలో కలిగింది. 3) ఎంఐఎం నాయకులు పి.వి.నరసింహారావు, ఎన్టీ రామారావు సమాధులు కూల్చివేయాలని ప్రకటించినప్పుడు తెరాస గట్టిగా ఖండించకపోవడం నగరవాసులకు రుచించలేదు. తెరాస, ఎంఐఎం లు ఒకేగూటి పక్షులుగా ఉన్నాయనే అపోహ ప్రజలలోకి వెళ్ళింది. దీనితో ప్రజలు భాజపై మొగ్గారు. 4) భాజపా తరఫున ప్రచారంకై జాతీయ అధ్యక్షులు జె,పి.నడ్డా, కేంద్ర మంత్రి అమిత్‌షా, జాతీయ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వీ సూర్య తదితరులు రావడం రాజకీయంగా వేడెక్కింది. తెరాసకు ప్రత్యమ్నాయం భాజాపానే అనే అభిప్రాయం నగరవాసులలో నెలకొంది. 5) గత ఆరేళ్ళుగా ఉద్యోగావకాశాలు లేకపోవడంతో నిరుద్యోగులలో, విద్యావంతులలో తీవ్ర నిరసన నెలకొంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, లాఠీదెబ్బలు తిని, జైలుకు కూడా వెళ్ళిన విద్యార్థులు రాష్ట్ర అవతరణ తర్వాత ఉద్యోగావకాశాలు ఉంటాయని ఆశించిననూ ఎలాంటి ప్రతిఫలం దక్కలేదు. దీనితో నిరుద్యోగులు, విద్యావంతులు తెరాసకు వ్యతిరేకంగా ఓటువేశారు. 6) అత్యంత ప్రధానమైనది తెరాస వ్యతిరేక ఓట్లు చీలకపోవడం. తెరాస ఉద్దేశ్యపుర్వకంగా కాంగ్రెస్ పార్టీని బలహీనపర్చడం భాజాపాకు బలం చేకూరింది. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ నాయకులను తెరాసలో చేర్చుకోవడంతో కాంగ్రెస్ బలహీనమైంది. తెరాసకు ప్రత్యమ్నాయంగా భాజపా నిలిచింది. తెరాస వ్యతిరేక ఓట్లన్నీ భాజపా పొందడంలో లాభపడింది. డివిజన్ సంఖ్య - డివిజన్ పేరు గెలిచిన అభ్యర్థి పార్టీ
|
విభాగాలు: హైదరాబాదు, ఎన్నికలు, 2020, |
GHMC, Hyderabad, GHMC Wards in Telugu, Ward wise corporators, TRS lost reasons in GHMC Elections, Reasons for BJP winning in GHMC elections 2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి