5, డిసెంబర్ 2020, శనివారం

కమతం రాంరెడ్డి (Kamatham Ram Reddy)

జననం
నవంబరు 1, 1938
స్వస్థలం
మహమ్మదాబాదు
రంగం
రాజకీయాలు
పదవులు
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చీఫ్ విప్, రాష్ట్ర మంత్రి,
మరణం
డిసెంబరు 5, 2020
మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడైన కమతం రాంరెడ్డి నవంబరు 1, 1938న గండీడ్ మండలం మహమ్మదాబాదులో జన్మించారు. 1967లో తొలిసారిగా ఇండిపెండెంటుగా పోటీచేసి పరిగి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కమతం రాంరెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున మరో 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా విజయం సాధించడమే కాకుండా ముగ్గురు ముఖ్యమంత్రుల హయంలో మంత్రిపదవి నిర్వహించారు. 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి భాజపాలోకి, 2018లో తెరాసలోకి చేరారు. డిసెంబరు 5, 2020న మహమ్మదాబాదులో మరణించారు.

రాజకీయ ప్రస్థానం:
1967లో తొలిసారి పరిగి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంటుగా పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీలో చేరి చీఫ్ విప్‌గా పదవి పొందరు. 1972లో కాంగ్రెస్ పార్టీ తరఫున అదేస్థానం నుంచి రెండోసారి విజయం సాధించారు. 1980లో ఎమ్మెల్సీగా గెలుపొందారు. 1985లో మళీ పరిగి నుంచి పోటీచేసి తెలుగుదేశం పార్టీకి చెందిన కొప్పుల హరీశ్వర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 1989లో పరిగి నుంచే పోటీచేసి మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. జలగం వెంగళరావు, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గాలలో స్థానం పొందారు. 1999, 2004, 2009లలో వరుసగా 3 సార్లు కొప్పుల హరీశ్వర్ రెడ్డి చేతిలో పరాజయం పొందారు. 2014లో కాంగ్రెస్ పార్టీ టికెట్ రానందున భాజపాలో చేరి తెదేపా, భాజపా కూటమి తరఫున పోటీచేసి ఓడిపోయారు. 2018లో భాజపా నుంచి తెరాసలో చేరారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా ప్రముఖులు, గండీడ్ మండలం,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక