24, డిసెంబర్ 2020, గురువారం

కామిని రాయ్ (Kamini Roy)

జననం
అక్టోబరు 12, 1864
రంగం
రచయిత్రి, సంస్కర్త,
మరణం
సెప్టెంబరు 27, 1933
బెంగాలీ కవియిత్రి, సంస్కర్త మరియు స్త్రీవాదిగా పేరుపొందిన కామిని రాయ్ అక్టోబరు 12, 1864న బెంగాల్‌లోని బసంద (ఇప్పటి బంగ్లాదేశ్)లో జన్మించింది. బెతూన్ పాఠశాలలో విద్యనభ్యసించి బ్రిటీష్ కాలంలో పాఠశాలకు హాజరైన మొదటి బాలికలలో ఒకరిగా పేరుపొందింది. బ్రిటిష్ ఇండియాలో మొదటి మహిళా గౌరవ గ్రాడ్యుయేట్ గానూ, బీఏ ఆనర్స్‌‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన మెుదటి భారతీయ మహిళగా గుర్తింపు పొందింది.

పలు రచనలు చేసి రచయితగా పేరుపొందిన కామిని రాయ్ సంస్కర్తగా బెంగాల్‌లో మహిళల ఓటుహక్కు కోసం ఉద్యమించిన నారీ సమాజ్ లో కూడా పాలుపంచుకుంది. అబాలా బోస్ నుండి స్త్రీవాద భావనలు తీసుకుంది. బెంగాలీ సాహిత్య సదస్సు అధ్యక్షురాలిగా, బెంగాలి సాహిత్య పరిషత్ ఉపాధ్యక్షురాలిగా పనిచేసింది. కామినితాయ్ ముఖ్యమైన రచనలు : మహాశ్వేతా పుండొరిక్, పౌరాణికి, ద్విప్ ఓ ధూప్, మాల్య ఓ నిర్మల్య, గుంజన్ (పిల్లల పుస్తకం), బాలిక సిక్కర్ ఆదర్శ.

కామిని రాయ్ సెప్టెంబరు 27, 1933న హజారీబాగ్ (బీహార్)లో మరణించింది. ఈమె సొదరుడు నిసిత్ చంద్ర సేన్ కలకత్తా హైకోర్టులో ప్రఖ్యాత న్యాయవాది మరియు కలకత్తా మేయర్ గా పనిచేశారు. భర్త కేదార్‌నాథ్ రాయ్‌. సొదరి జమినిరాయ్ నేపాల్ రాజు ఆస్థాన వైద్యురాలిగా పనిచేసింది.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు:భారతదేశ ప్రముఖ మహిళలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక