8, డిసెంబర్ 2020, మంగళవారం

పూనె (Pune)

రాష్ట్రం
మహారాష్ట్ర
జిల్లా
పూనె
జనాభా
31.24 లక్షలు
వైశాల్యం
15.6 చకిమీ
అక్షాంశ రేఖాంశాలు
18° 32" & 73° 51"
పిన్‌కోడ్
411001 – 411062
అధికార భాష
మరాఠి
పూనె మహారాష్ట్రకు చెందిన నగరం. ముంబాయి తర్వాత మహారాష్ట్రలో రెండో అతిపెద్ద నగరము మరియు దేశంలో 8వ పెద్ద నగరము. ముతానదీ తీరాన ఉన్న ఈ నగర జనాభా 31.24 లక్షలు. జాతీయోద్యమం సమయంలో ఈ నగరం ప్రసిద్ధి చెందింది. జాతీయ రహదారులు 65 మరియు 48 పూనె మీదుగా వెళ్తున్నాయి. లోహెగాన్ వద్ద అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. నగరపాలన పూనె నగరపాలక సంస్థచే నిర్వహించబడుతుంది. 2017 నగరపాలక ఎన్నికలలో భాజపా విజయం సాధించింది

భౌగోళికం:
18° 32" ఉత్తర అక్షాంశం మరియు 73° 51" తూర్పు రేఖాంశంపై ఉన్న పూనెనగరం ముతానది తీరాన ముంబాయికి ఆగ్నేయాన 150 కిమీ దూరంలో 560 మీ ఎత్తులో ఉంది. పూనె నగర వైశాల్యం 15.6 చకిమీ కాగా 2011 ప్రకారం జనాభా 31.24 లక్షలు, అర్బన్ అగ్లోమెరేషన్ జనాభా 50.57 లక్షలు. జనాభాలో పూనె నగరం మహారాష్ట్రలో రెండో స్థానంలో దేశంలో 8వ స్థానంలో ఉంది. పూనె సమీపం నుంచి భీమానది కూడా ప్రవహిస్తోంది.

చరిత్ర:
భారత జాతీయోద్యమ చరిత్రలో పూనె నగరం ప్రముఖ పాత్ర వహించింది. జాతీయోద్యమ సమయంలో పూనాలో ఫెర్గూసన్ కళాశాల ప్రారంభించబడింది. గోపాలకృష్ణ గోఖలే ప్రారంభించిన ప్రముఖ సంస్థ సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటి పూనెలోనే స్థాపితమైంది. 1932లో మహాత్మాగాంధీ - అంబేద్కర్‌ల మద్య పూనా ఒడంబడిక కుదిరింది. బాలగంగాధర తిలక్ ప్రారంభించిన హోంరూల్ ఉద్యమానికి పూనా ప్రధానకేంద్రంగా పనిచేసింది. దేశంలోనే తొలి మహిళా విశ్వవిద్యాలయం శ్రీమతి నత్తిబాయి తాకర్సే మహిళా విశ్వవిద్యాలయం కూడా పూనెలో ప్రారంభమైంది. మహాదేవ గోవింద రనడే పూనా సార్వజనీన సభను స్థాపించారు. శాతవాహన కాలానికి చెందిన ప్రముఖ శాసనం నానాఘాట్ శాసనాన్ని గౌతమీ బాలశ్రీ పూనా వద్ద వేయిందింది. పీష్వాల కాలంలో పూనె రాజధానిగా పనిచేసింది.

క్రీడలు:
బ్యాడ్మింటన్ క్రీడ పూనె నగరంలోనే ఉద్భవించినట్లుగా చెబుతారు. ప్రస్తుతం నగరంలో ప్రజాదరణ పొందిన క్రీడ క్రికెట్. 1994లో పూనెలో జాతీయ క్రీడలు, 2008లో కామన్వెల్త్ యూత్ క్రీడలు నిర్వహించబడ్డాయి. 37వేల మంది కూర్చునే క్రికెట్ స్టేడియం పూనెలో ఉంది. ఇందులో ఐపీఎల్‌లో 201-14 సీజన్‌లలో పూనెకు చెందిన ఫ్రాంచైజీ పూనె వారియర్స్ ఇండియా పాల్గొంది. ప్రముఖ క్రికెటర్ చందూబోర్డె, ప్రముఖ హాకీ క్రీడాకారుడు ధన్‌రాజ్ పిళ్ళై పూనెకు చెందినవారు.

రవాణా:
పూనా నుండి విజయవాడ వరకు ఉన్న జాతీయ రహదారి NH-9 (New 65), ముంబాయి-బెంగుళారులను కల్పే జాతీయ రహదారి 48 పూనెకు చెందిన ప్రముఖ రహదారులు. ముంబాయి-పూనెలను కల్పుతూ 6 వరసల ఎక్స్‌ప్రెస్ వే ఉంది. పూనె అంతర్జాతీయ విమానాశ్రయం లోహెగాన్ వద్ద ఉంది. పూనె మెట్రో రైల్వే నిర్మాణంలో ఉంది.
 
 


హోం
విభాగాలు: మహారాష్ట్ర నగరాలు, భారతదేశ ప్రముఖ నగరాలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక