12, జనవరి 2021, మంగళవారం

తుర్లపాటి కుటుంబరావు (Turlapaty Kutumba Rao)

జననం
ఆగస్టు 10, 1933
రంగం
జర్నలిజం
గుర్తింపులు
కళాప్రపూర్ణ, పద్మశ్రీ,
మరణం
జనవరి 11, 2021
ప్రముఖ పాత్రికేయుడిగా పేరుపొందిన తుర్లపాటి కుటుంబరావు ఆగస్టు 10, 1933న విజయవాడలో జన్మించారు. ప్రారంభంలో టంగుటూరి ప్రకాశం వద్ద కార్యదర్శిగా పనిచేశారు. తన పాత్రికేయ ప్రస్థానంలో 18 ముఖ్యమంత్రుల వద్ద పనిచేశి "18 ముఖ్యమంత్రులతో నా ముచ్చట్లు" పుస్తకాన్ని రాశారు. భారతప్రభుత్వం నుంచి 2002లో పద్మశ్రీ పురస్కారం పొంది ఈ ఘనత పొందిన తొలి తెలుగు జర్నలిస్టుగా పేరుపొందారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంచే కళాప్రపూర్ణ పొందారు. 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ పరిషత్తు చైర్మెన్‌గా పనిచేశారు. 20వేల సమావేశాలలో వక్తగా ప్రసంగించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. "నా కలం - నా గళం" పేరిట ఆత్మకథను రాశారు. జనవరి 11, 2021న తుర్లపాటి మరణించారు.

పాత్రికేయ ప్రస్థానం:
ఆంధ్రప్రభలో నార్ల వెంకటేశ్వరరావు సంపాదకీయాల ప్రభావంతో తుర్లపాటి పత్రికారచన ప్రారంభించి 1951లో ఎన్జీ రంగా వాహిని  పత్రికలో తొలిసారిగా ఉప సంపాదకులుగా పనిచేసి ఆ తర్వాత చలనాని రామారాయ్ "ప్రతిభ" పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు.  టంగుటూరి ప్రకాశం పంతులు ప్రజాపత్రికలో ఆంధ్రప్రాంత వార్తల సంపాదకునిగా పనిచేశారు. 1960-63 మరియు 1965-91 కాలంలో ఆంధ్రజ్యోతిలో పనిచేశారు. ఆ తర్వాత వార్త పత్రికలో కొంతకాలం పనిచేశారు. ఆంధ్రజ్యోతి పత్రికలో పనిచేస్తున్నప్పుడు వార్తల్లోని వ్యక్తి శీర్షికన సుమారు 4000 వ్యక్తుల జీవితచరిత్రను అందించారు. ఈ శీర్షిక వల్ల తుర్లపాటికి మంచిపేరు వచ్చింది.

ఇవి కూడా చూడండి:
  • కృష్ణా జిల్లా ప్రముఖులు,
  • ప్రముఖ తెలుగు పాత్రికేయులు,

హోం
విభాగాలు: కృష్ణా జిల్లా ప్రముఖులు, ప్రముఖ తెలుగు పాత్రికేయులు, 2021,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక