10, జనవరి 2021, ఆదివారం

మాధవ్‌సింగ్ సోలంకి (Madhav Singh Solanki)

జననం
జూలై 30, 1927
రంగం
రాజకీయాలు
పదవులు
గుజరాత్ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి,
మరణం
జనవరి 9, 2021
గుజరాత్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన మాధవ్‌సింగ్ సోలంకి జూలై 30, 1927న పిలుదర (మెహసనా జిల్లా, గుజరాత్)లో జన్మించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాధవ్‌సింగ్ సోలంకి గుజరాత్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. 3సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా, పి.వి.నరసింహారావు మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 93 సం.ల వయస్సులో జనవరి 9, 2021న మరణించారు. ఈయన కుమారుడు భారత్ సింగ్ కూడా గుజరాత్ పిసిసి అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా పనిచేశారు.

రాజకీయ ప్రస్థానం :
1976లో తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవి చేపటిన సోలంకి 1980లో రెండోసారి కూడా ముఖ్యమంత్రి పదవి చేపట్టి పూర్తి ఐదేళ్ళు పదవిలో కొనసాగినారు. 1991లో పి.వి.నరసింహరావు మంత్రివర్గంలో కీలకమైన విదేశీవ్యవహారాల శాఖ మంత్రిపదవిని నిర్వహించారు. 1989లో మూడోసారి గుజరాత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టినారు. ఈయన భద్రన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. 1980 దశకంలో క్షత్రియ, హరిజన, ఆదివాసి, ముస్లింల మద్దతుపై ఆధారపడ్డారు. గుజరాత్ రాజకీయాలలో ఇది ఖామ్‌ (KHAM) సిద్ధాంతంగా ప్రసిద్ధిచెందింది.

ఇవి కూడా చూడండి :

హోం
విభాగాలు: గుజరాత్ ముఖ్యమంత్రులు, గుజరాత్ రాష్ట్ర ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక