కోడంగల్ వికారాబాదు జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము కర్ణాటక సరిహద్దులో ఉన్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుంచి బీజాపూర్ వెళ్ళు అంతర్ రాష్ట్ర రహదారి ఈ మండలము నుంచే వెళ్తుంది. హైదరాబాదు నుంచి నైరుతి వైపున100 కిలో మీటర్ల దూరంలో ఉన్న మండలము ఉత్తరాన రంగారెడ్డి జిల్లా సరిహద్దును కల్గిఉంది. మండల కేంద్రం కోడంగల్ లో శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం, కస్తూరుపల్లిలో లొంకబసవన్న ఆలయం ఉన్నాయి. కొడంగల్ నుంచి 5 సార్లు విజయం సాధించిన ఆర్.గురునాథ్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు. మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు, 20 గ్రామపంచాయతీలున్నాయి. ఈ మండలము తాండూరు రెవెన్యూ డివిజన్, కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది.
భౌగోళికం, మండల సరిహద్దులు:
ఈ మండలము మహబూబ్ నగర్ జిల్లాలో వాయువ్యం వైపున ఉన్నది. ఈ మండలానికి ఉత్తరాన రంగారెడ్డి జిల్లా, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రము, తూర్పున బొంరాస్‌పేట మండలము, దక్షిణమున దౌలతాబాదు మండలాలు ఉన్నాయి. కొడంగల్ 17° 6' ఉత్తర అక్షాంశము మరియు 77° 37' తూర్పు రేఖాంశం మీదుగా ఉంది.
దర్శనీయ స్థలాలు
కోడంగల్ పట్టణంలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధి గాంచినది. పట్టణం నడిబొడ్డున కల ఈ దేవాలయంనకు ప్రతి సంవత్సరం జాతర కూడా జర్గుతుంది. మండలములోనే కాకుండా 15 మండలాలు కల నారాయణపేట డివిజన్‌లోనే ఈ దేవస్థానం పేరుగాంచినది. ఏటా నిర్వహించే జాతర సమయంలో పరిసర ప్రాంతాలనుంచే కాకుండా రంగారెడ్డి జిల్లా మరియు కర్ణాటకలోని పలు ప్రాంతాలనుంచి ప్రజలు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. కొడంగల్ పట్టణంలో నాలుగువందల సంవత్సరాల పూర్వపు మసీదు కూడా ఉన్నది.
జనాభా
2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 53542. ఇందులో పురుషులు 26550, మహిళలు 26992. అక్షరాస్యుల సంఖ్య 25669.
చరిత్ర
మండల పరిధిలోని రుద్రారం గ్రామం కాకతీయుల కాలం నాటిది. ఇక్కడ రుద్రమదేవిచే ప్రతిష్టించబడిన గణపతి ఆలయం ఉంది. రుద్రారం పేరు కూడా రుద్రమదేవి మీదుగా వచ్చినట్లు ప్రతీతి. పూర్వం ఈ ప్రాంతము కర్ణాటక రాష్ట్రములోని గుల్బర్గా జిల్లాలో భాగంగా ఉండేది. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలుగు మాట్లాడే ప్రాంతాలు ఆంధ్ర ప్రదేశ్ లో భాగమైనాయి. అప్పటినుంచి ఈ ప్రాంతము మహబూబ్ నగర్ జిల్లాలో తాలుకాగా కొనసాగింది. 1986లో మండలాల వ్యవస్థ ప్రకారం ఇది ప్రత్యేకంగా మండలంగా ఏర్పడి కొనసాగుతోంది.
కోడంగల్‌కు రైలు సౌకర్యం లేకున్ననూ రోడ్డు సౌకర్యం బాగుగా ఉంది. హైదరాబాదు-బీజాపూర్ అంతర్రాష్ట్ర రహదారి కోడంగల్ గుండా వెళుతుంది. అంతేకాకుండా మహబూబ్ నగర్ - తాండూరు రహదారి కూడా ఈ కూడలి గుండానే వెళుతుంది. కోడంగల్ హైదరాబాదు నుంచి 100 కిమీ, మహబూబ్ నగర్ నుంచి 60 కిమీ, తాండూరు నుంచి 17 కిమీ దూరంలో ఉన్నది. కోడంగల్‌కు సమీపంలోని రైల్వేస్టేషన్ తాండూరు రైల్వేస్టేషన్ (17 కిమీ).
ఈ మండలము కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. కోడంగల్ నుంచి 5 సార్లు విజయం సాధించిన రావులపల్లి గురునాథ్ రెడ్డి మండలంలోని రావులపల్లి గ్రామానికి చెందినవారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ మరియు తెలుగుదేశం పార్టీలు బలంగా ఉన్నాయి. 2001 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నర్సిములు, 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముదిగుడ్ల కృష్ణ ఎన్నికయ్యారు. 2014లో ఎంపీపీగా తెలుగుదేశం పార్టీకి చెందిన దయాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. 2019 ప్రాదేశిక ఎన్నికలలో ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముద్దప్ప ఎన్నికయ్యారు.
వ్యవసాయం, నీటిపారుదల
మండలం మొత్తం వైశాల్యం 21794 హెక్టార్లలో 52% భూమి వ్యవసాయయోగ్యంగా ఉన్నది. మండలంలో అత్యధికంగా పండించే పంటలు కందులు, వరి, జొన్నలు,పెసర్లు. మండలం మొత్తంలో 5 చిన్ననీటిపారుదల వ్యవస్థల కింద 804 హెక్టార్ల భూమి సాగుఅవుతుంది. మండలంలో సాధారణ వర్షపాతం 729 మిమీ 2007-08లో అత్యధికంగా 1297 మిమీ వర్షపాతం కురిసింది. విద్యాసంస్థలు: 2008-09 నాటికి మండలంలో 46 ప్రాథమిక పాఠశాలలు (42 మండల పరిషత్తు, 1 పైవేటు ఎయిడెడ్, 3 ప్రైవేటు అన్-ఎయిడెడ్), 15 ప్రాథమికోన్నత పాఠశాలలు (9 మండల పరిషత్తు, 6 పైవేటు), 11 ఉనత పాఠశాలలు (1 ప్రభుత్వ, 7 జడ్పీ, 1 ప్రైవేట్ ఎయిడెడ్, 2 ప్రైవేట్ అన్-ఎయిడెడ్) పాఠశాలలు, 2 జూనియర్ కళాశాలలు (ఒకటి ప్రభుత్వ, మరొకటి ప్రైవేట్) ఉన్నాయి.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
22, జనవరి 2013, మంగళవారం
కోడంగల్ మండలము (Kodangal Mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి