2007నాటి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 5 మండలాలు కలవు. ఈ నియోజకవర్గంలోని 5 మండలాలలో 3 మండలాలు వికారాబాదు జిల్లాలో, 2 మండలాలు మహబూబ్‌నగర్ జిల్లాలో కలవు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు అన్ని మండలాలు మహబూబ్‌నగర్ జిల్లాలో ఉండేవి. ఈ అసెంబ్లీ నియోజక వర్గం మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. పునర్విభజనకు పూర్వం అసంపూర్తిగా ఉన్న మద్దూరు మండలం ప్రస్తుతం పూర్తిగా ఈ నియోజకవర్గంలో చేరగా, ఇదివరకు ఈ నియోజకవర్గంలో ఉన్న దామరగిద్ద మండలం కొత్తగా ఏర్పాటైన నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కలిసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రావులపల్లి గురునాథ్ రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 5 సార్లు విజయం సాధించారు. ఇప్పటివరకు ఈ నియోజకవర్గం నుంచి విజయం సాధించి మంత్రిపదవిని పొందిన ఏకైక వ్యక్తి అచ్యుతరెడ్డి.
నియోజకవర్గపు భౌగోళిక సరిహద్దులు
మహబూబ్ నగర్ జిల్లాలో వాయువ్యాన ఉన్న ఈ నియోజకవర్గానికి తూర్పున రంగారెడ్డి జిల్లాకు చెందిన పరిగి అసెంబ్లీ నియోజకవర్గం, ఉత్తరాన రంగారెడ్డి జిల్లాకే చెందిన తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉండగా, వాయువ్యాన మరియు దక్షిణాన నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దుగా ఉంది.
ఎన్నికైన శాసనసభ్యులు
వివిధ పార్టీల పరిస్థితి
ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి భారత జాతీయ కాంగ్రెస్ ఆధిపత్యం వహిస్తున్నది. 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత ఆ పార్టీ కూడ ఈ నియోజకవర్గంలో ఉనికిని చూపుతోంది. ఇప్పటివరకు జరిగిన శాసనసభ ఎన్నికలలో 4 సార్లు కాంగ్రెస్ విజయం సాధించగా, తెలుగుదేశం పార్టీ కూడా 4 సార్లు విజయం సాధించింది. 1985 తరువాత విజయం సాధించిన అభ్యర్థులకు పోలైన ఓట్లలో 50% మించి ఓట్లు రావడం విశేషం. దీనికి ప్రధాన కారణం ఈ నియోజకవర్గంలో మూడో పార్టీ బలంగా లేకపోవడం. ఈ నియోకవర్గం నుంచి గురునాథ్ రెడ్డి అత్యధికంగా ఐదు సార్లు విజయం సాధించారు. మొదటిసారి 1978లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి గెలవగా ఆ తరువాత 4 సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించారు. ప్రస్తుతం తెలుగుదేశం ఫార్టీకి చెందిన యువనాయకుడు రేవంత్ రెడ్డి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1999 ఎన్నికలు 1999 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్.గురునాథ్ రెడ్డి తన ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన డి.శారదపై 13702 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. గురునాథ్ రెడ్డికి 59624 ఓట్లు రాగా, శారద 45922 ఓట్లు సాధించింది. 2004 ఎన్నికలు
2004 శాసనసభ ఎన్నికలలో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన గురునాథ్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన ఎన్.ఎం.అనురాధపై 5965 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. గురునాథ్ రెడ్డి 61452 ఓట్లు సాధించగా, అరుణకు 55487 ఓట్లు లభించాయి
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నాయకుడు ఆర్.గురునాథ్ రెడ్డి పోటీ చేయగా, తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్సీ అయిన రేవంత్ రెడ్డి పోటీచేశారు. భారతీయ జనతా పార్టీ నుండి అనంతరామచందర్, లోకసత్తా పార్టీ తరఫున ఎస్.జయప్రకాష్, ప్రజారాజ్యంతో పొట్టు పెట్టుకున్న మనపార్టీ తరఫు నుండి సావిత్రి పోటీచేశారు. ప్రధాన పోటీ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురునాథరెడ్డిపై 6989 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
2014 ఎన్నికలు: 2014 శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెరాస అభ్యర్థి, 5 సార్లు ఎమ్మెల్యే అయిన రావులపల్లి గురునాథ్ రెడ్డిపై 14457 ఓట్ల మెజారిటితో విజయం సాధించి వరసగా రెండోసారి శాసనసభలో ప్రవేశించారు. 2018 ఎన్నికలు: 2018 శాసనసభ ఎన్నికలలో తెరాస తరఫున పట్నం నరేందర్ రెడ్డి, భాజపా తరఫున నాగూరావు నామాజీ, ప్రజాకూటమి తరఫున కాంగ్రెస్ పార్టీకి చెందిన అనుముల రేవంత్ రెడ్డి పోటీచేశారు. తెరాసకు చెందిన పట్నం నరేందర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన అనుముల రేవంత్ రెడ్డి పై 9319 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నియోజకవర్గపు ప్రముఖులు
|
Tags:Kodangal Assembly Constituency information in Telugu, Vikarabad Dist Assembly Constituencies in Telugu, Mahabubnagar Dist Assembly Constituencies in Telugu, Kodangal, Kosgi, Doulthabad, Damargidda, Maddur Mandals
Meeru manchi information ichharu,Thank you very much.
రిప్లయితొలగించండి