బొంరాస్‌పేట వికారాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము. ఈ మండలంలో కక్రవాణి ప్రాజెక్టు ఉంది. మండలంలోని పోలెపల్లి గ్రామంలో ఏటా ఎల్లమ్మ జాతర నిర్వహిస్తారు. 2004లో మహబూబ్ నగర్ నుంచి లోకసభకు ఎన్నికైన దేవరకొండ విఠల్ రావు ఈ మండలంనకు చెందినవారు.హైదరాబాదు నుంచి బీజాపూర్ వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. ఈ మండలము నారాయణపేట రెవెన్యూ డివిజన్, కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 55647.మండలంలో 27 రెవెన్యూ గ్రామాలు, 26 గ్రామపంచాయతీలు కలవు.పోలేపల్లి గ్రామంలో ప్రఖ్యాతి చెందిన ఎల్లమ్మ దేవాలయం ఉంది.
భౌగోళిక పరిస్థితి, మండల సరిహద్దులు: బొంరాస్‌పేట మండలం జిల్లాలో వాయువ్యాన రంగారెడ్డి జిల్లా సరిహదులో ఉన్నది. మండల విస్తీర్ణం 22079 హెక్టార్లు. అందులో 2494 హెక్టార్లు (11%) అటవీప్రాంతము. సాగుభూమి 14801 హెక్టార్లు (67%). ఈ మండలమునకు ఉత్తరమున కోడంగల్ మండలం, తూర్పున కోస్గి మండలం, దక్షిణమున మద్దూరు, దామరగిద్ద మండలములు, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 48037. ఇందులో పురుషులు 23762, మహిళలు 24275. 2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 55647. ఇందులో పురుషులు 27766, మహిళలు 27881. అక్షరాస్యుల సంఖ్య 22968. రవాణా సౌకర్యాలు: హైదరాబాదు నుంచి బీజాపూర్ వెళ్ళు అంతర్రాష్ట్ర రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. మండల కేంద్రం మాత్రం అంతర్రాష్ట్ర రహదారికి కొద్దిగా లోనికి ఉంది. ఆర్టీసి బస్సులు తక్కువగాఉండి ప్రైవేటు వాహనాలపై ఆధారపడవలసి వస్తుంది.
ఈ మండలము కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగము. 2004లో మహబూబ్ నగర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున లోకసభకు ఎన్నికైన దేవరకొండ విఠల్ రావు మండలంలోని లగచర్ల గ్రామానికి చెందినవారు. 2001 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొట్ల యాదగిరి, 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్కిరెడ్డి విజయం సాధించారు. 2014లో ఎంపీపీగా తెలుగుదేశం పార్టీకి చెందిన మంగమ్మ ఎన్నికయ్యారు. దర్శనీయ ప్రాంతాలు: మండల కేంద్రం సమీపంలో సంగాయపల్లిగడ్డ వద్ద 300 సంవత్సరాల చరిత్ర ఉన్న సంగమేశ్వరాలయం ఉంది. పోలేపల్లి గ్రామంలో ప్రఖ్యాతి చెందిన ఎల్లమ్మ దేవాలయం ఉంది. ఏటా ఇక్కడ వైభవంగా జాతర నిర్వహిస్తారు. వ్యవసాయం, నీటిపారుదల మండలం మొత్తం విస్తీర్ణం 22079 హెక్టార్లలో 87% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట కందులు. వరి, జొన్నలు,పెసర్లు, వేరుశనగ కూడా పండిస్తారు. మండలంలో 14 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 1645 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి. విద్యాసంస్థలు: 2008-09 నాటికి మండలంలో 60 ప్రాథమిక పాఠశాలలు (2 ప్రభుత్వ, 53 మండల పరిషత్తు, 5 పైవేటు), 17 ప్రాథమికోన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 16 మండల పరిషత్తు), 5 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 4 జడ్పీ) పాఠశాలలు, ఒక ప్రవేట్ జూనియర్ కళాశాలల ఉన్నది.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
22, జనవరి 2013, మంగళవారం
బొంరాస్ పేట్ మండలము (Bomraspet mandal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి