24, జనవరి 2013, గురువారం

నర్వ మండలము (Narwa Mandal)

జిల్లా నారాయణపేట
రెవెన్యూ డివిజన్ నారాయణపేట
జనాభా46052 (2001)
49843 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంమక్తల్
లోకసభ నియోజకవర్గంమహబూబ్ నగర్
పర్యాటక ప్రాంతాలుచంద్రగఢ్ కోట
ముఖ్య పంటలుకందులు, వరి
మండల ప్రముఖులుదయాకర్ రెడ్డి,.
నర్వ నారాయణపేట జిల్లాకు చెందిన మండలము. ఇది నారాయణపేట రెవెన్యూ డివిజన్‌, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలో 31 రెవెన్యూ గ్రామాలు, 23 గ్రామపంచాయతీలు కలవు. 2009లో కొత్తకోట నుంచి ఎన్నికైన దయాకర్ రెడ్డి ఈ మండలానికి చెందినవారు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 49843. మరాఠా పీష్వా మొదటి బాజీరావు కాలంలో నిర్మించిన చంద్రగఢ్ కోట ఈ మండలంలోనే ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న ఈ మండలం కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో కలిసింది.

సరిహద్దులు:
ఈ మండలమునకు ఉత్తరమున ధన్వాడ మండలము, తూర్పున చిన్నచింతకుంట మండలము, ఆగ్నేయాన ఆత్మకూరు మండలము, దక్షిణాన కృష్ణానది దానికి ఆవల ధరూరు మండలము, పశ్చిమాన మక్తల్ మండలము సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 46052. ఇందులో పురుషులు 23083, మహిళలు 22969. 
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 49843. ఇందులో పురుషులు 24873, మహిళలు 24970. జనాభాలో ఇది జిల్లాలో 48వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
ప్రధాన రహదారిపై లేకుండుటచే మండలానికి సరైన రవాణా సౌకర్యాలు లేవు. అయిననూ మక్తల్, ఆత్మకూరు నుంచి మహబూబ్ నగర్ (వయా లాల్కోట) నుంచి రహదారి సౌకర్యం ఉంది.

రాజకీయాలు:
ఈ మండలము మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. 2009లో కొత్తకోట నుంచి శాసనసభకు ఎన్నికైన దయాకర్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు

మక్తల్ నియోజకవర్గంలో
నర్వ మండల స్థానం (ఆకుపచ్చ రంగు)
విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 25 ప్రాథమిక పాఠశాలలు (అన్నీ మండల పరిషత్తు), 10 ప్రాథమికోన్నత పాఠశాలలు (9 మండల పరిషత్తు, 1 ప్రైవేట్), 8 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 7 జడ్పీ) ఉన్నవి.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 39257 హెక్టార్లలో 41% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట కందులు, వరి. వేరుశనగ కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 551 మిమీ. మండలంలో సుమారు 5400 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

నర్వ మండలంలోని గ్రామపంచాయతీలు
 


ఇవి కూడా చూడండి:

  •  
హోం,
విభాగాలు:
నారాయణపేట జిల్లా మండలాలు,  నర్వ మండలము, నారాయణపేట రెవెన్యూ డివిజన్, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం, 
  • https://narayanpet.telangana.gov.in/ (Narayanapet Dist official website)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక