22, జనవరి 2013, మంగళవారం

ఆత్మకూరు మండలం (Athmakur Mandal)

జిల్లా వనపర్తి
రెవెన్యూ డివిజన్వనపర్తి
జనాభా55686 (2001)
60657 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంమక్తల్
లోకసభ నియోజకవర్గంమహబూబ్‌నగర్
పర్యాటక ప్రాంతాలు
ముఖ్య పంటలువరి
మండల ప్రముఖులు
ఆత్మకూరు వనపర్తి జిల్లాకు చెందిన మండలము. ఇది వనపర్తి రెవెన్యూ డివిజన్‌, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగము. గుండాల వద్ద జూరాల విద్యుత్ కేంద్రం నిర్మించారు. మండలంలో ఒక పురపాలక సంఘం, 7 ఎంపీటీసి స్థానాలు, 17 రెవెన్యూ గ్రామాలు, 13 గ్రామపంచాయతీలు కలవు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 60657. 2009 వరకు మండలంలోని అమరచింత గ్రామం అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంగా ఉండింది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 55686. ఇందులో పురుషులు 28089, మహిళలు 27597. 
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 60657. ఇందులో పురుషులు 30453, మహిళలు 30204. పట్టణ జనాభా 11367, గ్రామీణ జనాభా 49290. జనాభాలో ఇది జిల్లాలో 25వ స్థానంలో ఉంది.

మండల సరిహద్దులు:
ఈ మండలము త్రికోణాకృతిలోఉంటూ ఆగ్నేయాన మొనతేలినట్లు ఉన్నది. దక్షిణమున కృష్ణానది సరిహద్దు దానికి ఆవల ధరూర్, గద్వాల మండలములు, తూర్పున కొత్తకోట మండలం, ఉత్తరమున చిన్నచింతకుంటమండలం, పశ్చిమాన నర్వ మండలము సరిహద్దులుగా ఉన్నది.

రవాణా సౌకర్యాలు:
సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం మండలం గుండా వెళ్ళుచున్నది. కృష్ణానది తీరాన ఉన్న ఆరేపల్లిలో రైల్వేస్టేషన్ ఉంది. ఆత్మకూరు నుంచి గద్వాల, కొత్తకోటమహబూబ్ నగర్ వెళ్ళుటకు రోడ్డుసౌకర్యం ఉంది.

మక్తల్ నియోజకవర్గంలో
ఆత్మకూర్ మండల స్థానం (గులాబి రంగు)
రాజకీయాలు:
ఈ మండలము నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. పునర్వివస్థీణకు ముందు అమరచింత అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండేది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన రాజేందర్ సింగ్ ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 40 ప్రాథమిక పాఠశాలలు (1 ప్రభుత్వ, 29 మండల పరిషత్తు, 10 ప్రైవేట్), 16 ప్రాథమికోన్నత పాఠశాలలు (8 మండల పరిషత్తు, 8 ప్రైవేట్), 18 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 7 జడ్పీ, 10 ప్రైవేట్), ఒక  ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 20242 హెక్టార్లలో 50% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట వరి. వేరుశనగ, కందులు కూడా పండిస్తారు. వరి పంట సాగులో ఈ మండలం జిల్లాలో రెండో స్థానంలో ఉంది. మండల సాధారణ వర్షపాతం 583 మిమీ. మండలంలో సుమారు 6300 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.


హోం,
విభాగాలు
: వనపర్తి జిల్లా మండలాలు, ఆత్మకూరు మండలము, 
 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత పర్యటించి తెలుసుకున్న విషయాలు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక