24, జనవరి 2013, గురువారం

నారాయణపేట మండలము (Narayanapet Mandal)

జిల్లా నారాయణపేట
రెవెన్యూ డివిజన్ నారాయణపేట
జనాభా85515 (2001)
97774 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంనారాయణపేట
లోకసభ నియోజకవర్గంమహబూబ్‌నగర్
పర్యాటక ప్రాంతాలుఎక్లాస్‌పూర్
ముఖ్య పంటలుకందులు
మండల ప్రముఖులురాంచందర్ రావు కళ్యాణి
నారాయణపేట నారాయణపేట జిల్లాకు చెందిన మండలము. నిజాం విమోచనోద్యమకారుడు రాంచందర్ రావు ఎక్బోటే, భాజపా నాయకుడు నాగూరావు నామోజీ ఈ మండలమునకు చెందినవారు. మండలంలోని పేరపళ్ళ వద్ద జయమ్మ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలనే ప్రతిపాదన ఉంది. ఈ మండలము జిల్లాలో పశ్చిమం వైపున కర్ణాటక సరిహద్దులో ఉంది. ఇది నారాయణపేట రెవెన్యూ డివిజన్, నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 97774. మండల కేంద్రము నారాయణ పేట జిల్లాలోనే తొలి పురపాలక సంఘం. ఎక్లాస్ పూర్ లో ప్రాచీనమైన ఔదుంబరేశ్వరాలయం ఉంది. నాణ్యమైన బంగారం వ్యాపారానికి, పట్టుచీరల ఉత్పత్తికి మండల కేంద్రం పేరుగాంచినది. మండలంలో 24 రెవెన్యూ గ్రామాలు, 20 గ్రామపంచాయతీలున్నాయి.మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటి ఉంది. ఈ ప్రాంతం లోకపల్లి సంస్థానంలో భాగంగా ఉండేది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న ఈ మండలం కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో కలిసింది.

సరిహద్దులు:
ఈ మండలమునకు ఉత్తరమున దామరగిద్ద, మద్దూరు మండలములు, తూర్పున కోయిలకొండ, ధన్వాడ మండలములు, దక్షిణమున ఉట్కూరు మండలము, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. 

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 85515. ఇందులో పురుషులు 42602, మహిళలు 42913. 
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 97774. ఇందులో పురుషులు 48924, మహిళలు 48850. పట్టణ జనాభా 41539, గ్రామీణ జనాభా 56235. జనాభాలో ఇది జిల్లాలో 6వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
నారాయణపేట ప్రధాన రహదారిపై లేకున్ననూ ప్రధాన పట్టణాల నుంచి బస్సుసౌకర్యం ఉంది. హైదరాబాదు, మహబూబ్ నగర్, మక్తల్, తాండూరు తదితర ప్రధాన పట్టణాలకే కాకుండా కర్ణాటక సరిహద్దులో ఉండుటచే యాద్గిల్ తదితర కర్ణాటక పట్టణాలకు కూడా బస్సుసౌకర్యం ఉంది.

చరిత్ర:
నారాయణపేట సమీపంలోని ఎక్లాస్‌పూర్ ఒకప్పుడు లోకాయపల్లి సంస్థానం కేంద్రంగా ఉండింది. సంస్థానం కేంద్రస్థానం పాలమూరుకు తరలించడానికి ముందు ఈ ప్రాంతం వైభవంగా వెలుగొందినది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న ఈ మండలం కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో కలిసింది.

నారాయణపేట నియోజకవర్గంలో
నారాయణపేట మండల స్థానం (ఎరుపు రంగు)
రాజకీయాలు:
ఈ మండలము నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2009లో తొలిసారిగా నారాయణపేట నియోజకవర్గం కేంద్రం అయింది. అంతకు క్రితం ఈ మండలం మక్తల్ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. మండల కేంద్రానికి చెంది కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో మార్కెటిగ్ శాఖ మంత్రిగా పనిచేసిన  రాంచందర్ రావు కళ్యాణి , నాగూరావు నామాజీ భాజపా జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. ఈ మండలంలో భారతీయ జనతా పార్టీ,  తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీలు బలంగా ఉన్నాయి.2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పుష్పలత ఎన్నికయ్యారు.
2013 జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో మండలంలోని 20 పంచాయతీలకు గాను భారతీయ జనతాపార్టీ మద్దతుదారులు 8, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 5, తెదేపా మద్దతుదారులు 4, వైకాపా మద్దతుదారులు 2, స్వతంత్రులు ఒక్కరు సర్పంచి స్థానాలలో విజయం సాధించారు.

విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 64 ప్రాథమిక పాఠశాలలు (17 ప్రభుత్వ, 30 మండల పరిషత్తు, 3 ప్రైవేట్ ఎయిడెడ్, 14 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 20 ప్రాథమికోన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 13 మండల పరిషత్తు, 6 ప్రైవేట్), 23 ఉన్నత పాఠశాలలు (6 ప్రభుత్వ, 3 జడ్పీ, 3 ప్రైవేట్ ఎయిడెడ్, 11 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 5 జూనియర్ కళాశాలలు (1 ప్రభుత్వ, 4 ప్రైవేట్) ఉన్నవి.

అధ్యాత్మికం:
మండలకేంద్రం సమీపంలో ఎక్లాస్‌పూర్‌లో ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వరాలయం ఉంది. సింగారంలో మహాలింగేశ్వర స్వామి ఆలయం ఉంది.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 26968 హెక్టార్లలో 43% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట కందులు. వరి, పెసర్లు, వేరుశనగ, కందులు కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 602 మిమీ. మండలంలో సుమారు 3500 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది. 

కాలరేఖ:
  • 2005 ఆగస్టు 15: మావోయిస్టుల దాడిలో మక్తల్ శాసనసభ్యుడు చిట్టెం నర్సిరెడ్డి, పురపాలక సంఘం కమీషనర్ రాంమోహన్ రావులతో కలిపి మొత్తం 11 మంది మరణించారు.
  • ముఖ్యమంత్రి వైఎస్సార్ నారాయణపేట పట్టణం సందర్శించారు.
  • 2009, సెప్టెంబరు 16: పేరపళ్ళ ఎంపీటీసి ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన జంకమ్మ విజయం సాధించింది.
  • 2011, డిసెంబరు 3: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు రాంచందర్ ఎక్బోటే మరణించారు.

మండల ప్రముఖులు:
  • రాంచందర్ రావు ఎక్బోటే (నిజాం విమోచనోద్యమకారుడు)
  • రాంచందర్ రావు కళ్యాణి (విమోచనోద్యమకారుడు, మాజీ మంత్రి)
  • నాగూరావు నామాజీ (రాజకీయ నాయకుడు)
నారాయణపేట మండలంలోని గ్రామపంచాయతీలు
 


ఇవి కూడా చూడండి:

  •  
విభాగాలు: నారాయణపేట జిల్లా మండలాలు,  నారాయణపేట మండలము, నారాయణపేట రెవెన్యూ డివిజన్, నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గం
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • మహబూబ్‌నగర్ జిల్లా స్వాతంత్ర్యోద్యమ చరిత్ర,
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం, 
  • https://narayanpet.telangana.gov.in/ (Narayanapet Dist official website)

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక