28, జనవరి 2013, సోమవారం

రేవంత్ రెడ్డి (Revanth Reddy)

అనుముల రేవంత్ రెడ్డి 1969, నవంబరు 8న వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు. విద్యార్థిదశలోనే విద్యార్థి సంఘం నాయకుడిగా వ్యవహరించారు. తెరాస ద్వారా రాజకీయప్రవేశం చేసి 2006లో ఇండిపెండెంటుగా మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం సాధించి, ఆ తర్వాత రాజీనామా చేసి విధానపరిషత్తు ఉప ఎన్నికలలో గెలుపొందినారు. ఇండిపెండెంటుగా పోటీచేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి 2009, 2014లలో కోడంగల్ నుంచి వరస విజయాలు సాధించిననూ 2018లో తెరాస చేతిలో ఓడిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో మల్కాజ్‌గిరి నుంచి విజయం సాధించారు.

నాగం జనార్థన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయిన పిదప రేవంత్ రెడ్డి జిల్లాలోనే కాకుండా తెలంగాణ ప్రాంతంలోనే పార్టీ తరఫున ప్రముఖ నాయకుడిగా చెలామణి అయ్యారు. 2014 శాసనసభ ఎన్నికలలో మరోసారి కోడంగల్ నుంచే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి రెండోసారి శాసనసభలో ప్రవేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు కేసులో మే 31, 2015 నాడు సీబీసిచే అరెస్ట్ అయి జైలుకు వెళ్ళారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల తెలుగుదేశం పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి అక్టోబరు 31, 2017న కాంగ్రెస్ పార్టీలో ప్రవేశించారు. 2018 డిసెంబరులో జరిగిన ముందస్తు ఎన్నికలలో మరోసారి కోడంగల్ బరిలో కాంగ్రెస్ పక్షాన ప్రజాకూటమి అభ్యర్థిగా నిలబడి పోటీచేసి తెరాసకు చెందిన పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో మల్కాజ్‌గిరి నుంచి విజయం సాధించి తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టారు.

ఇవి కూడా చూడండి:


హోం,
విభాగాలు: పాలమూరు జిల్లా రాజకీయ నాయకులు,  వంగూరు మండలము,  కోడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం13వ శాసనసభ సభ్యులు,

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక