తెలంగాణ ఉద్యమకారుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రసిద్ధి చెందిన నాయిని నరసింహారెడ్డి మే 12, 1940న జన్మించారు. నల్గొండ జిల్లా నేరెడుగొమ్ము (చందంపేట మండలం) ఈయన స్వస్థలం. హెచ్చెస్సీ వరకు అభ్యసించిన నరసింహారెడ్డి 1970లలోనే హైదరాబాదుకు వలస వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. హైదరాబాదు మున్సిపల్ కార్మిక సంఘం నేతగా గుర్తింపు పొందారు. హింద్ మజ్దూర్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ముల్కీ ఉద్యమం, జైతెలంగాణ ఉద్యమం, ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం, తెలంగాణ ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్నారు. 1978లో తొలిసారి శాసనసభకు ఎన్నికైన నాయిని 2014లో తెలంగాణ రాష్ట్ర తొలి హోంశాఖ మంత్రిగా పదవి పొందారు. అక్టోబరు 20, 2020న హైదరాబాదులో మరణించారు రాజకీయ ప్రస్థానం: కమ్యూనిస్టు, సోషలిస్టు, తెలంగాణ ప్రజాసమితి, జనతా పార్టీ, జనతాదళ్, తెలుగుదేశం, తెరాస, తదితర పార్టీలలో పనిచేశారు. 1978లో ముషీరాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనతాపార్టీ తరఫున పోటీచేసి టంగుటూరి అంజయ్యపై విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1985లో రెండోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. 2004లో తెరాస తరఫున 3వ సారి విజయం సాధించి వైఎస్సార్ మంత్రివర్గంలో కొంతకాలం పనిచేశారు. 2014 ఎన్నికలలో పోటీచేయకున్ననూ కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ తొలి మంత్రిమండలిలో హోంశాఖ మంత్రిగా పదవి పొందారు. 2014, జూన్ 20న గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. 2018 ఎన్నికల తర్వాత మంత్రివర్గంలో చోటుదక్కలేదు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
4, జూన్ 2014, బుధవారం
నాయిని నరసింహారెడ్డి (Nayini Narsimha Reddy)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి