19, సెప్టెంబర్ 2020, శనివారం

తిరుమల రామచంద్ర (Tirumala Ramachandra)

జననం
జూన్ 17, 1913
రంగం
రచయిత, పరిశోధకుడు,
గుర్తింపులు
సాహిత్య అకాడమీ పురస్కారం
ఆత్మకథ పేరు
హంపీ నుంచి హరప్పా దాకా
మరణం
అక్టోబరు 12, 1997
పత్రికా రచయితగా, పండితునిగా, పరిశోధకుడిగా, సమరయోధుడిగా పేరుపొందిన తిరుమల రామచంద్ర జూన్ 17, 1913అనంతపురం జిల్లా ధర్మవరం మండలం రేగటిపల్లి అగ్రహారంలో జన్మించారు. మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి విద్వాన్ పట్టా పొందిన రామచంద్ర విద్యార్థిదశలోనే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని 12 నెలలు జైలుశిక్ష పొందారు. తెలుగు, సంస్కృత, హిందీ, కన్నడ, తమిళ, ఆంగ్ల 6 భాషలలో నిష్ణాతుడిగా పేరుపొందారు. 1944లో కాన్పూర్ లోని డైలీ టెలిగ్రాఫ్‌లో రిపోర్టర్‌గా పాత్రికేయ జీవనం ఆరంభించి పలు పత్రికలకు ఉప సంపాదకుడిగా, సంపాదకుడిగా పనిచేశారు. 1945-47 కాలంలో "తెలంగాణ పత్రిక"లో, మీజాన్ దినపత్రికలో ఉప సంపాదకుడిగా పనిచేశారు. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికలలో సహాయ సంపాదకుడిగా, భారతి ఎడిటర్ ఇంచార్జీగా పనిచేశారు. మద్రాస్ నుంచి వెలువడిన "పరిశోధన" ద్వైమాసిక పత్రికకు సంపాదకుడిగా 1953-1956 మధ్యకాలంలో పనిచేశారు. అడవి బాపిరాజు, వేటూరి ప్రభాకర శాస్త్రి శిష్యునిగా, విద్వాన్ విశ్వం వంటి సహచరులతో కలిసి పనిచేదిన రామచంద్ర అక్టోబరు 12, 1997న హైదరాబాదులో మరణించారు

తిరుమల రామచంద్ర ప్రముఖ రచనలు: 
నుడి నానుడి, సాహితీ సుగతుని స్వగతం, మనలిపి-పుట్టుపూర్వోత్తరాలు, మరపురాని మనుషులు, తెలుగు సాహిత్య పత్రికల చరిత్ర, హంపీ నుంచి హరప్పా దాకా (ఆత్మకథ)

గుర్తింపులు:
"సాహితీ సుగతుని స్వగతం" గ్రంధానికి 1970 లో రాష్ట్ర సాహిత్య అకాడమీ నుంచి ఉత్తమ సాహిత్య విమర్శ పురస్కారం, "గాధా సప్తసతిలో తెలుగు పదాలు" కు 1986 లో సాహిత్య అకాడమీ నుండి అవార్డు, ఆత్మకథ అయిన "హంపీ నుంచి హరప్పా దాక" గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ (2002) పురస్కారం లభించింది. 
 
 
ఇవి కూడా చూడండి:
  • ధర్మవరం మండలం
  • జూన్ 17 (చరిత్రలో ఈ రోజు),
  • అక్టోబరు 12 (చరిత్రలో ఈ రోజు),
  • హంపి నుంచి హరప్పా దాకా,
 


హోం
విభాగాలు: అనంతపురం జిల్లా ప్రముఖులు, తెలుగు సాహితీవేత్తలు, తెలుగు పాత్రికేయులు,


 = = = = =

ఆధారాలు, సంప్రదింపు గ్రంథాలు, వెబ్‌సైట్లు:
  • పత్రికారంగంలో తెలుగు ప్రముఖులు,
  • ప్రముఖ ఆంధ్రులు,
  • ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక సంచికలు,
  •  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక