ప్రముఖ భౌతికశాస్త్రవేత్తగా పేరుపొందిన చంద్రశేఖర వెంకటరామన్ నవంబరు 7, 1888న ఇప్పటి తమిళనాడులోని తిరుచినాపల్లి ప్రాంతంలో జన్మించారు. 1907లో ఎం.ఎస్సీ.(ఫిజిక్స్)లో విశ్వవిద్యాలయ ప్రథముడిగా నిలిచారు. 18 వ ఏటనే కాంతికి సంబంధించిన ధర్మాలపై ఈయన రచించిన పరిశోధనా వ్యాసం లండన్ నుంచి వెలువడే ఫిలసాఫికల్ మేగజైన్‌లో ప్రచురితమైంది. ఐసిఎస్ పాసైన రామన్ కలకత్తా ప్రభుత్వ ఆర్థికశాఖలో డిప్యూటీ అకౌంటెంట్ జనరల్‌గా చేరారు. విజ్ఞాన పరిశోధన తృష్ణ వలన తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి కలకత్తా యూనివర్సిటీ ఫిజిక్స్ ప్రొఫెసరుగా చేరారు. 1928లో రామన్ ఎఫెక్టును కనుగొన్నందుకు 1930లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. 1954లో భారత ప్రభుత్వం ఆయనను భారతరత్న పురస్కారంతో సత్కరించింది. ఆయన పరిశోధన ఫలితాన్ని ధృవపరిచిన ఫిబ్రవరి 28 రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. రామన్ నవంబరు 21, 1970న బెంగుళూరులో మరణించారు.
రామన్ ఎఫెక్ట్: సముద్రపు నీటిపై సూర్యకాంతి పడినప్పుడు ఆ కాంతిలోని నీలం రంగు ఎక్కువగా పరిక్షేపం (scattering) చెంది మన కంటికి చేరడం వల్లనే సముద్రం నీలంగా కనిపిస్తుందని సి.వి.రామన్ సిద్ధాంతీకరించాడు. ఇలా ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో తెలిపే పరిశోధన ఫలితాన్నే రామన్ ఎఫెక్ట్ అంటారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
Tags: C.V.Raman in Telugu, Telugulo c.v.raman, తెలుగులో సి.వి.రామన్, c.v.raman quiz in telugu, scientists biography in telugu, telugulo shastravettalu, science samacharam in telugu, about C.V.Raman, Biography of C.V.Raman
శాస్త్రవేత్తలకు సంబంధించి ఎంపికచేసిన ప్రశ్నలు, వివిధ పోటీపరీక్షలలో వచ్చిన ప్రశ్నలు, వందకుపైగా శాస్త్రవేత్తలకు సంబంధించి పాయింట్లవారీ పట్టికలు కలిగిన CCKRao సీరీస్ "ప్రపంచప్రసిద్ధి శాస్త్రవేత్తలు క్విజ్" పుస్తకం రూ.40/-, పేజీలు 96. మరిన్ని వివరాలకు ఇక్కడ నొక్కండి.
nice biography
రిప్లయితొలగించండిPlease give nivedika
రిప్లయితొలగించండి