23, ఫిబ్రవరి 2015, సోమవారం

నితీష్ కుమార్ (Nitish Kumar)

 నితీష్ కుమార్
జననంమార్చి 1, 1951
రంగంరాజకీయాలు
పదవులుకేంద్ర మంత్రి, బీహార్ ముఖ్యమంత్రి,
బీహార్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు నితీష్ కుమార్ మార్చి 1, 1951న జన్మించారు. ఈయన తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో పాట్నా నుంచి డిగ్రీ పూర్తిచేసిన నితీష్ కుమార్ సోషలిస్టు సిద్ధాంతాలవైపు మొగ్గు చూపి 1970లలో జయప్రకాష్ నారాయణ ఉద్యమానికి ప్రభావితుడై రాజకీయాలలో ప్రవేశించారు. కేంద్రమంత్రిగా, బీహార్ ముఖ్యమంత్రిగా పదవులు పొందారు.

రాజకీయ ప్రస్థానం:
తొలి సారిగా 1985లో బీహార్ శాసనసభకు ఇండిపెండెంటుగా పోటీచేసి ఎన్నికైనారు. ఆ తర్వాత లోక్‌దళ్‌లో చేరారు. 1989లో జనతాదళ్ ప్రధాన కార్యదర్శి అయ్యారు. అదే సంవత్సరంలో 9వ లోకసభకు ఎన్నికై విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మంత్రివర్గంలో స్థానం పొందారు. 1991లో 10వ లోకసభకు కూడా ఎన్నికై అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కూడా స్థానం పొందారు. ఇతను కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా ఉన్నప్పుడే గోధ్రా సంఘటన జరిగింది. 1994లో జార్జి ఫెర్నాండెజ్‌తో కలిసి సమతాపార్టీని స్థాపించారు. తర్వాత ఆ పార్టీని జనతాదళ్ (యునైటెడ్)లో విలీనం చేశారు.

నితీష్ కుమార్ జనరల్ నాలెడ్జి
2005లో 15 సంవత్సరాల లాలు కుటుంబ పాలన ముగిసి ఎన్డీఏ విజయం సాధించడంతో నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. 2000లో తొలిసారి ముఖ్యమంత్రి పీఠం దక్కిననూ మెజారిటీ నిరూపించకపోవడంతో ఏడు రోజులకే పదవి వదులుకోవాల్సి వచ్చింది. 2005 నుంచి 2014 వరకు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేన నితీష్ కుమార్ 2014లో నరేంద్రమోడి ప్రధానమంత్రి అయ్యాక బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి జీతన్ రాం మాంఝీని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొండబెట్టారు. మళ్ళీ ఫిబ్రవరి 2015లో తానే ముఖ్యమంత్రి అయ్యారు. 2015 శాసనసభ ఎన్నికలలో మహాకూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీలో ఉంటూ కూటమిని విజయవంతంగా గెలిపించారు. 2020 శాసనసభ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో మరోసారి బీహార్ ముఖ్యమంత్రిగా అధికారం స్వీకరించారు.
 
 
 
 


విభాగాలు: బీహార్ రాష్ట్ర ప్రముఖులు , బీహార్ ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, 1951లో జన్మించినవారు, 9వ లోకసభ సభ్యులు, 10వ లోకసభ సభ్యులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక