4, సెప్టెంబర్ 2017, సోమవారం

గండీడ్ మండలం (Gandeed Mandal)

జిల్లా మహబూబ్‌నగర్
రెవెన్యూ డివిజన్ మహబూబ్‌నగర్
జనాభా70349
అసెంబ్లీ నియోజకవర్గంపరిగి
లోకసభ నియోజకవర్గంచేవెళ్ళ
మండల ప్రముఖులు
కమతం రాంరెడ్డి
గండీడ్ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మండలము. అక్టోబరు 11, 2016నఈ మండలం మహబూబ్‌నగర్ జిల్లాలో చేరింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం అప్పటి రంగారెడ్డి జిల్లాలో ఉండేది. మహబూబ్‌నగర్ నుంచి తాండూరు వెళ్ళు ప్రధాన రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది. మహమ్మదాబాదు మరియు గండీడ్ మండలంలోని ప్రధాన గ్రామాలు.
 
ప్రముఖ రాజకీయ నాయకుడు, ముగ్గురు ముఖ్యమంత్రుల హయంలో మంత్రిగా పనిచేసిన కమతం రాంరెడ్డి ఈ మండలానికి చెందినవారు.

సరిహద్దులు:
గండీడ్ మండలం మహబూబ్‌నగర్ జిల్లాలో ఉత్తరం వైపున వికారాబాదు జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున నవాబ్‌పేట మండలం, దక్షిణాన హన్వాడ మరియు కోయిలకొండ మండలాలు, పశ్చిమాన కోస్గి మండలం, ఉత్తరాన వికారాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 61683. ఇందులో పురుషులు 30694, మహిళలు 30989. 1991 జనాభాతో పోలిస్తే దశాబ్ద కాలంలో 26.47% వృద్ధి సాధించింది. 2001 లెక్కల ప్రకారం రంగారెడ్డి జిల్లాలో అత్యధిక జనాభా కల మండలాలలో ఇది 17వ స్థానంలో ఉంది.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 70349. ఇందులో పురుషులు 35049, మహిళలు 35300. అక్షరాస్యుల సంఖ్య 34802.

రవాణా సౌకర్యాలు:
మహబూబ్‌నగర్ నుంచి తాండూరు వెళ్ళు ప్రధాన రహదారి మండలం మీదుగా గండీడ్, మహమ్మదాబాదు గ్రామాలమీదుగా వెళ్ళుచున్నది. నంచర్ల కూడలి నుంచి పరిగి వెళ్ళు రహదారి కూడా ప్రారంభమగును.

రాజకీయాలు:
ఈ మండలం పరిగి అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2001-06 కాలంలో ఎంపిపిగా అలివేలు అనురాధ, జడ్పీటీసిగా కమతం శ్రీనివాస్ రెడ్డి పనిచేశారు.

మండలంలోని గ్రామపంచాయతీలు:
బలుసుకొండ, చిన్నవర్వల్, చౌడర్‌పల్లి, గాద్రియాల్, గండీడ్, జక్కలపల్లి, జానంపల్లి, జిన్నారం, జిల్లపల్లి, కొంరెడ్డిపల్లి, కొండాపూర్, మంగంపేట, మహమ్మదాబాద్, ముకర్లాబాద్, నంచెర్ల, పగిడ్యాల్, పెద్దవర్వల్, రంగారెడ్డిపల్లి, రెడ్డిపల్లి, రుసుంపల్లి, సల్కర్‌పేట్, షేక్‌పల్లి, వెంకటరెడ్డిపల్లి, వెన్నచేడ్

మండలంలోని గ్రామాలు:
కప్లాపూర్ (Kaplapur), వెన్నాచేడ్ (Vennached), జిన్నారం (Jinnaram), చెలిమిల్ల (Chelmilla), సాలార్‌నగర్ (Salarnagar), పెద్దవర్యాల్ (Peddavarval), చిన్నవర్యాల్ (Chinnavarval), రుసుంపల్లి (Rusumpalle), గండీడ్ (Gandeed), బైస్‌పల్లి (Baispalle), రెడ్డిపల్లి (Reddipalle), సల్కార్‌పేట్ (Salkerpet), గోవిందపల్లి (Govindapalle), పగిడ్యాల్ (Pagdiyal), బల్సుల్‌గొండ (Balsulgonda), కొండాపూర్ (Kondapur), మన్సూర్‌పల్లి (Mansoorpalle), కొంరెడ్డిపల్లి (Komreddipalle), నంచర్ల (Nancherla), గాద్రియాల్ (Gadrial), చౌదర్‌పల్లి (Chowderpalle), మంగంపేట (Mangampet), ముకర్లబాద్ (Mukarlabad), జూలపల్లి (Julapalle), అన్నారెడ్డిపల్లి (Annareddipalle), లింగంపల్లి (Lingaipalle), మహమ్మదాబాద్ (Mohammadabad), సంగాయిపల్లి (Sangaipalle)
 
ప్రముఖ గ్రామాలు / పట్టణాలు
 
మహమ్మదాబాదు (Mahammadabad):
మహమ్మదాబాదు మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామం మహబూబ్‌నగర్ నుంచి తాండూరు వెళ్ళు ప్రధాన రహదారిపై ఉంది. ప్రముఖ రాజకీయ నాయకుడు, ముగ్గురు ముఖ్యమంత్రుల హయంలో మంత్రిపదవి నిర్వహించిన కమతం రాంరెడ్డి ఈ గ్రామానికి చెందినవారు.
 
 
 
 
 
 

హోం,
విభాగాలు
: మహబూబ్‌నగర్ జిల్లా మండలాలు,  గండీడ్ మండలము,   పరిగి రెవెన్యూ డివిజన్,  చేవెళ్ళలోకసభ నియోజకవర్గం,

= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011. 
  • బ్లాగు రచయిత పర్యటించి, తెలుసుకున్న విషయాలు, 
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు G.O.Ms.No.241 Dt: 11-10-2016

Tags: Gandeed Mandal in Telugu, Mahabubnagar Dist information in Telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక