కృష్ణ నారాయణపేట జిల్లాకు చెందిన మండలము. అక్టోబరు 11, 2016న తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఈ మండలం కొత్తగా ఏర్పడింది. ఇది జిల్లాలో అతిపశ్చిమాన కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉంది. అదివరకు మాగనూరు మండలంలో ఉన్న 12 గ్రామాలను విడదీసి ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. మండలం దక్షిణ సరిహద్దు గుండా కృష్ణానది ప్రవహిస్తుంది. కృష్ణానది తెలంగాణలో ప్రవేశించు ప్రాంతం తగడి ఈ మండలంలోనే ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న ఈ మండలం కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో కలిసింది.
సరిహద్దులు: ఈ మండలానికి ఈశాన్యాన మరియు తూర్పున మాగనూరు మండలం, మిగితా అన్ని వైపులా కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. మండలం దక్షిణ సరిహద్దు గుండా కృష్ణానది ప్రవహిస్తుంది. రవాణా సౌకర్యాలు: మండలం గుండా వాడి-గుంతకల్ రైలుమార్గం వెళ్ళుచున్నది. మండల కేంద్రం కృష్ణ వద్ద రైల్వేస్టేషన్ ఉంది. మండలంలోని గ్రామాలు: కృష్ణ (Krishna), తంగడిగి (Thangadigi), శుకుర్‌లింగంపల్లి (Shukurlingamppalli), కుసుమూర్తి (Kusumurthy), చేగుంట (Chegunta), ఐనాపుర్ (Ainapur), కున్సీ (Kunsi), గూడెబల్లూర్ (Gudebellur), ముడుమాల్ (Mudumal), మురహరిదొడ్డి (Muraharidoddi), గురజాల (Gurujala), ఆలంపల్లి (Alampalli)
(కృష్ణా మండలంలోని గ్రామపంచాయతీలు)
ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Tags: Gandeed Mandal in Telugu, Mahabubnagar Dist information in Telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి