10, నవంబర్ 2017, శుక్రవారం

షాబాద్ మండలం (Shabad Mandal)

జిల్లా రంగారెడ్డి జిల్లా
రెవెన్యూ డివిజన్ చేవెళ్ళ
జనాభా51154
అసెంబ్లీ నియోజకవర్గంచేవెళ్ళ
లోకసభ నియోజకవర్గంచేవెళ్ళ
షాబాద్ రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం. ఇది చేవెళ్ళ రెవెన్యూ డివిజన్, చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. మండలంలో 25 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. రజాకార్లపై పోరాడిన గజవాడ మల్లయ్యగుప్త, రంగారెడ్డి జడ్పీ చైర్మెన్‌గా పనిచేసిన పి.సునీతారెడ్డి, తాండూరు నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన పట్నం మహేందర్ రెడ్డి, 2సార్లు ఎమ్మెల్సీగా, ఒకసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పట్నం నరేందర్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు. తెలంగాణలో తొలి టైల్స్ పరిశ్రమ మండలంలోని చందనవెల్లిలో ఏర్పాటు చేస్తున్నారు

సరిహద్దులు:
ఈ మండలం రంగారెడ్డి జిల్లా పశ్చిమభాగంలో వికారాబాదు జిల్లా సరిహద్దులో ఉంది. ఉత్తరాన చేవెళ్ళ మండలం, ఈశాన్యాన మొయినాబాదు మండలం, తూర్పున కొత్తూరు మరియు నందిగామ మండలాలు, దక్షిణాన ఫరూఖ్‌నగర్ మండలం, నైరుతిన కొందుర్గ్ మండలం, పశ్చిమాన వికారాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 47486. ఇందులో పురుషులు 24233, మహిళలు 23253. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 51154. ఇందులో పురుషులు 26134, మహిళలు 25020. అక్షరాస్యుల సంఖ్య 27822.

రాజకీయాలు:
ఈ మండలం చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. రంగారెడ్డి జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్‌గా పనిచేసిన సునీతా మహేందర్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పట్నం మహేంద్రర్ రెడ్డి ఈ మండలమునకు చెందినవారు.



ఫోటో గ్యాలరీ
c
c


హోం,
విభాగాలు: రంగారెడ్డి జిల్లా మండలాలు,  షాబాద్ మండలము, చేవెళ్ళ రెవెన్యూ డివిజన్, చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గం, 
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Rangareddy Dist, 2008,
  • Handbook of Census Statistics, Rangareddy Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 250 తేది: 11-10-2016


Tags:Shabad Mandal in telugu, rangareddy Dist Mandals information in telugu, Shabad Mandal information in Telugu, villages in Shabad Mandal: అనంతవరం (Ananthawaram), బొంగిర్‌పల్లి (Bhongirpalle), బొబ్బిల్గాం (Bobbilgam), చందవవల్లి (Chandenvalle), దామెరపల్లి (Damerlapalle), ఎట్ల ఎర్రవల్లి (Etlaerravaly), హయతాబాద్ (Hayathabad), కాక్లూర్ (Kakloor), కేశవరం (Kesavaram), కొమెరబండ (Komerabanda), మాచన్‌పల్లి (Machanpalle), మద్దూర్ (Maddur), మాన్‌మర్రి (Manmarri), నాగర్‌కుంట (Nagarkunta), ఓబగుంట (Obagunta), పెద్దావెడ్ (Peddaved), పోలారం (Polaram), పోతుగల్ (Pothugal), రంగాపూర్ (Rangapur), రేగడిదోస్వాడ (Regadidoswada), రుద్రారం (Rudraram), షాబాద్ (Shabad), సోలిపేట్ (Solipet), తాడ్లపల్లి (Tadlapalle), తిర్మలాపూర్ (Tirumalapur)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక