తిరుమలగిరి సాగర్ నల్గొండ జిల్లాకు చెందిన మండలము. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. అదివరకు అనుముల (హాలియా), పెద్దవూర మండలాలలోని 14 రెవెన్యూ గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. మండలానికి దక్షిణ సరిహద్దు గుండా కృష్ణానది ప్రవహిస్తోంది. ఈ మండలం మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్, నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున అడవిదేవులపల్లి మండలం, పశ్చిమాన పెద్దవూర మండలం, ఉత్తరాన అనుముల (హాలియా) మండలం, దక్షిణాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. మండలం దక్షిణ సరిహద్దు గుండా కృష్ణానది ప్రవహిస్తోంది. రాజకీయాలు: ఈ మండలము నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం, నల్గొండ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలోని గ్రామాలు: Alwala, Chinthalapalem, Jemmanakota, Kompally, Konerupur, Nellikal, Nethapoor, Rajavaram, Siligapoor, Srirampur, Thimmaipalem, Thirumalagiri, Thunikinuthala, Yallapur ప్రముఖ గ్రామాలు అనుముల నల్గొండ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. హోంశాఖ మంత్రిగా పనిచేసిన కుందూరు జానారెడ్డి స్వగ్రామం. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
tags: Thirumalagiri sagar Mandal Nalgonda Dist (district) Mandal in telugu, nalgonda Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి