22, జనవరి 2013, మంగళవారం

కోడేరు మండలం (Kodair Mandal)

జిల్లా నాగర్‌కర్నూల్
రెవెన్యూ డివిజన్ నాగర్‌కర్నూల్
జనాభా32540 (2001)
44313 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంకొల్లాపూర్
లోకసభ నియోజకవర్గంనాగర్‌కర్నూల్
పర్యాటక ప్రాంతాలు
ముఖ్య పంటలుమొక్కజొన్న
మండల ప్రముఖులు
కోడేరు నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు, 15 గ్రామపంచాయతీలున్నాయి. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 44313. ప్రముఖ కవి తెలకపల్లి రామచంద్రశాస్త్రి, ఎమ్మెల్యేగా పనిచేసిన కొత్త రామచంద్రారావు ఈ మండలమునకు చెందినవారు.

మండల సరిహద్దులు:
ఈ మండలమునకు ఉత్తరమున గోపాల్ పేట మండలము, తూర్పున పెద్దకొత్తపల్లి మండలము, దక్షిణమున కొల్లాపూర్, వీపనగండ్ల మండలములు, పశ్చిమాన పానగల్ మండలము సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 32540. ఇందులో పురుషులు 16381, మహిళలు 16159. జనసాంద్రత 157/చకిమీ. స్త్రీపురుష నిష్పత్తి 984. అక్షరాస్యత శాతం 45.64%. ఎస్సీల సంఖ్య 5253, ఎస్టీల సంఖ్య 3357.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 44313. ఇందులో పురుషులు 22883, మహిళలు 21430. జనాభాలో ఇది జిల్లాలో 57వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
నాగర్‌కర్నూల్ నుంచి కొల్లాపూర్ వెళ్ళు రహదారి మండలళ్ నుంచి వెళ్ళుచున్నది.

రాజకీయాలు:
ఈ మండలము కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగము. 1989లో కొల్లాపూర్ నుంచి విజయం సాధించిన కొత్త రామచంద్రారావు ఈ మండలమునకు చెందినవారు. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సురేందర్ గౌడ్ ఎన్నికయ్యారు. 2006 సర్పంచి ఎన్నికలలో మండలంలోని 15 గ్రామపంచాయతీలకుగాను కాంగ్రెస్ పార్టీ 11, తెలుగుదేశం పార్టీ 4 పంచాయతీలలో విజయం సాధించాయి. 2014లో కోడేరు ఎంపీపీగా తెరాస పార్టీకి చెందిన చిన్న రామ్మోహన్ రావు ఎన్నికయ్యారు.

కొల్లాపూర్ నియోజకవర్గంలో
కోడేరు మండల స్థానం (ఎరుపు రంగు)
విద్యాసంస్థలు:
మండలంలో 31 ప్రాథమిక పాఠశాలలు (1 ప్రభుత్వ, 30 మండల పరిషత్తు), 9 ప్రాథమికోన్నత (8 మండల పరిషత్తు, 1 ప్రైవేట్), 8 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 6 జడ్పీ, 1 ప్రైవేట్) ఉన్నాయి.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 30912 హెక్టార్లలో 32% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట మొక్కజొన్న. వరి, వేరుశనగ కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 663 మిమీ. మండలంలో సుమారు 1400 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

కోడేరు మండలంలోని గ్రామపంచాయతీలు
1.కదీరాపాడు6.నాగులపల్లి11.మైలారం
2.కొండ్రావుపల్లి7.పసుపుల12.యాతం
3.కోడేర్8.బస్వాయిపల్లి13.రాజాపూర్
4.జనుంపల్లి9.మాచుపల్లి14.సర్పాయిపల్లి
5.తీగలపల్లి10.ముత్తిరెడ్డిపల్లి15.సింగాయిపల్లి



విభాగాలు: నాగర్‌కర్నూల్ జిల్లా మండలాలు, కోడేరు మండలము, నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజన్, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం,  
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర (రచన- ఆచార్య ఎస్వీ రామారావు),
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక