24, జనవరి 2013, గురువారం

వీపనగండ్ల మండలము (Weepangandla Mandal)

జిల్లా వనపర్తి
రెవెన్యూ డివిజన్
వనపర్తి
జనాభా45535 (2001)
51412 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంకొల్లాపూర్
లోకసభ నియోజకవర్గంనాగర్‌కర్నూల్
ముఖ్య పంటలువేరుశనగ, వరి
మండల ప్రముఖులుజూపల్లి కృష్ణారావు
వీపనగండ్ల వనపర్తి జిల్లాకు చెందిన మండలము. ఇది వనపర్తి రెవెన్యూ డివిజన్, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. మండలంలో 8 ఎంపీటీసి స్థానాలు, 11 రెవెన్యూ గ్రామాలు, 14 గ్రామపంచాయతీలు కలవు. రాష్ట్రమంత్రిగా పనిచేసిన జూపల్లి కృష్ణారావు, సాహితీవేత్త ఎల్లూరి శివారెడ్డి ఈ మండలమునకు చెందినవారు. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 51412.

సరిహద్దులు:
ఈ మండలమునకు ఉత్తరమున పానగల్ మండలము, ఈశాన్యమున కోడేరు మండలము, తూర్పున కొల్లాపూర్ మండలము, దక్షిణాన కృష్ణానది దానికి ఆవల ఆలంపూర్ మండలము, కర్నూలు జిల్లా, పశ్చిమాన పెబ్బేరు మండలము సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 45535. ఇందులో పురుషులు 23306, మహిళలు 22229.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 51412. ఇందులో పురుషులు 26302, మహిళలు 25110. జనాభాలో ఇది జిల్లాలో 44వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
మండలం గుండా ప్రధాన రహదారి లేకుండుట, దక్షిణ సరిహద్దుగా కృష్ణానది ఉండుటచే మండలానికి రవాణా సౌకర్యాలు అంతగా లేవు. కొల్లాపుర్, పెబ్బేరుల నుంచి రోడ్డు సౌకర్యం ఉంది.

కొల్లాపూర్ నియోజకవర్గంలో
వీపనగండ్ల మండల స్థానం (గులాబి రంగు)
రాజకీయాలు:
ఈ మండలము కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కృష్ణయ్య ఎన్నికయ్యారు. 2014లో వీపనగండ్ల ఎంపీపీగా తెరాస పార్టీకి చెందిన లావణ్య ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 32 ప్రాథమిక పాఠశాలలు (అన్నీ మండల పరిషత్తు), 7 ప్రాథమికోన్నత పాఠశాలలు (అన్నీ మండల పరిషత్తు), 17 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 16 జడ్పీ), ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 34568 హెక్టార్లలో 32% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట వేరుశనగ, వరి. కందులు, ఇతరపంటలు కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 588 మిమీ. మండలంలో సుమారు 5400 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

విభాగము: వీపనగండ్లమండలంలోని రెవెన్యూ గ్రామాలు
(Portal: Revenue Villages in Weepangandla Mandal)
  1. అమ్మాయిపల్లి (Ammaipally),
  2. అయ్యవారిపల్లి (Ayyavaripally),
  3. బెక్కం (Bekkam),
  4. చెల్లిపాడు (Chellepad),
  5. చిన్నమారూర్ (Chinnamarur),
  6. దగడ (Dagada),
  7. దగడపల్లి (Dagadapally),
  8. గడ్డబస్వాపూర్ (Gaddabaswapur),
  9. గోపాలపురం (Gopalapuram),
  10. గోవర్థనగిరి (Govardhangiri),
  11. జటప్రోలు (Jataprole),
  12. కల్లూరు (Kalloor),
  13. కొండూరు (Konduru),
  14. కొప్పునూరు (Koppunur),
  15. లక్ష్మీపల్లి (Lakshmipally),
  16. మియాపురం (Miyapuram),
  17. పెద్దమారూరు (Peddamarur),
  18. సంపత్‌రావుపల్లి (Sampatraopally),
  19. సంగినేనిపల్లి (Sanginepally),
  20. సింగవరం (Singavaram),
  21. సోలిపురం (Solipuram),
  22. తూంకుంట (Toomkunta),
  23. వీపనగండ్ల (Weepangandla),
  24. వెలుగొండ (Velgonda),
  25. వెల్లటూరు (Vellatur),
 రెవెన్యూ గ్రామాలు కాని పంచాయతీలు
  1. పెద్దదగడ (Peddadagada),
అనుబంధ గ్రామాలు



హోం,
విభాగాలు:
వనపర్తి జిల్లా మండలాలు,   వీపనగండ్ల మండలము,  వనపర్తి రెవెన్యూ డివిజన్,  కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,

1 కామెంట్‌:

  1. namasthe sir meyokka samacharam bagunnadi kani nadi oka salaha na peru farooq nenu veepanagandla (mdl) ki chendina vadini meru e blog yokka mukkya uddeyeshyam emo theliyadhu dini maku baga upayogam undi ani anukuntunna ma yokka gramam veltoor ayithe ma gramaniki vellalante naraka yathanam ga undi pebber nundi chinnambavi ki road margam darunanga undi daniki mi blog nundi complaint chesthunnanu sir

    రిప్లయితొలగించండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక