24, జనవరి 2013, గురువారం

వంగూరు మండలము (Vangoor Mandal)

జిల్లా నాగర్‌కర్నూల్
రెవెన్యూ డివిజన్ కల్వకుర్తి
జనాభా45304 (2001)
50141 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంఅచ్చంపేట
లోకసభ నియోజకవర్గంనాగర్ కర్నూల్
పర్యాటక ప్రాంతాలుగెల్వలాంబమాత ఆలయం,
ముఖ్య పంటలుప్రత్తి
మండల ప్రముఖులురేవంత్ రెడ్డి,
పి.రాములు,
టీవీ దేశ్‌ముఖ్
వంగూర్ నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలము. హైదరాబాదు-శ్రీశైలం ప్రధాన రహదారి ఈ మండలం గుండా వెళ్ళుతుంది. దుందుభినది మండలం గుండా ప్రవహిస్తోంది. ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, రాములు, జైపాల్ యాదవ్, ప్రముఖ కవి మరిగంటి జగన్నాథచార్యులు, ఆరెస్సెస్ ప్రముఖుడు టీవీ దేశ్‌ముఖ్ ఈ మండలమునకు చెందినవారు. ఈ మండలము మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజన్, అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 50141. మండల కేంద్రంలో గెల్వలాంబమాత ఆలయం ఉంది.

సరిహద్దులు:
ఈ మండలమునకు ఉత్తరమున వెల్దండ, మాడ్గుల మండలములు, దక్షిణాన దుంధుభీ నది దానికి ఆవల ఉప్పునూతల మండలము, పశ్చిమాన కల్వకుర్తి మండలము, తూర్పున నల్గొండ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 45304. ఇందులో పురుషులు 23178, మహిళలు 22128. 
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 50141. ఇందులో పురుషులు 25561, మహిళలు 24580. జనాభాలో ఇది జిల్లాలో 46వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
మహబూబ్ నగర్ నుంచి నల్గొండ వెళ్ళు రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది.

రాజకీయాలు:
వంగూరు మండలము అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూలు లోకసభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే రాములు ఈ మండలమునకు చెందినవారు. 2001 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఎడపాకుల లక్ష్మమ్మ, 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన గుర్కా జైపాల్ యాదవ్ విజయం సాధించారు. ఈయన 2009లో కల్వకుర్తి నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందినారు. జైపాల్ యాదవ్ రాజీనామాతో 2009 సెప్టెంబరులో జరిగిన జడ్పీటీసి ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన గుండె వెంకటయ్య గౌడ్ విజయం సాధించారు. 2014 ఎంపీటీసి ఎన్నికలలో 14 స్థానాలకుగాను కాంగ్రెస్ 7, తెదేపా, తెరాస, భాజపా కూతమికి 7 స్థానాలు లభించాయి. టాస్ ద్వారా ఎంపిపి పదవి కాంగ్రెస్ పార్టీకి చెందిన భాగ్యలక్ష్మికి లభించింది.

అచ్చంపేట నియోజకవర్గంలో
వంగూరు మండల స్థానం (నలుపు రంగు)
విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 43 ప్రాథమిక పాఠశాలలు (40 మండల పరిషత్తు, 3 ప్రైవేట్), 13 ప్రాథమికోన్నత పాఠశాలలు (11 మండల పరిషత్తు, 2 ప్రైవేట్), 9 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 8 జడ్పీ) 1 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఉన్నది.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 35259 హెక్టార్లలో 34% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట ప్రత్తి.  వరి. మొక్కజొన్న, కందులు, వేరుశనగ కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 518 మిమీ. మండలంలో సుమారు 3400 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

కాలరేఖ:
  • 2013, జూన్ 25: వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన యాదయ్య సైన్యంలో విధులు నిర్వహిస్తూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడిలో మరణించాడు. 
  • 2014, జూలై 4: ఎంపిపిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన భాగ్యలక్ష్మి టాస్ ద్వారా ఎన్నికయ్యారు. 
  • 2014, అక్టోబరు 25: ఆరెస్సెస్ ప్రముఖుడు, పలు రాష్ట్రాలకు సంఘ్‌చాలక్‌గా వ్యవహరించిన టీవీ దేశ్‌ముఖ్ మరణించారు.

విభాగాలు: నాగర్‌కర్నూల్ జిల్లా మండలాలు,  వంగూరు మండలము,  రెవెన్యూ డివిజన్, అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • పాలమూరు ఆధునిక యుగ కవుల చరిత్ర (రచన- ఆచార్య ఎస్వీ రామారావు),
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక