షాద్‌నగర్ రంగారెడ్డి జిల్లాకు చెందిన మండలము. 44వ నెంబరు జాతీయ రహదారి (పాత పేరు 7వ), సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం కూడా మండలం గుండా వెళ్ళుచున్నవి. షాద్‌నగర్, బూర్గుల మండలంలోని రైల్వేస్టేషన్లు. హైదరాబాదు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు, గవర్నరుగా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి ఈ మండలమునకు చెందినవారే. జాతీయ స్థాయిలో పలుమార్లు ఉత్తమ గ్రామపంచాయతీగా అవార్డులు పొందిన హాజీపల్లి ఈ మండలంలోనిదే. ఇది షాద్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ మండలం పండ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందినది. ఏనుగుల వీరస్వామి కాశీయాత్రలో భాగంగా ఈ మండలం మీదుగా వెళ్ళినారు. ఒక రాత్రి మండలకేంద్రంలో బసచేసినారు.
సరిహద్దులు: ఈ మండలమునకు ఉత్తరమున షాబాద్ మండలం మరియు నందిగామ మండలం, తూర్పున కేశంపేట మండలం, పశ్చిమాన కొందుర్గ్ మండలం, దక్షిణాన మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 97063. ఇందులో పురుషులు 49665, మహిళలు 47398. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 112458. ఇందులో పురుషులు 57299, మహిళలు 55159. పట్టణ జనాభా 45603, గ్రామీణ జనాభా 66855. 2011 జనాభా ప్రకారం ఈ మండలం జనాభాలో జిల్లాలో మూడవ స్థానంలో ఉంది. అక్షరాస్యత శాతం 68.80%. ఇది జిల్లాలో అత్యధిక అక్షరాస్యత శాతం కల మండలాలలో రెండవ స్థానంలో ఉంది. రవాణా సౌకర్యాలు: 44వ నెంబరు జాతీయ రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నది. బైపాస్ రహదారి వల్ల మండల కేంద్రానికి జాతీయరహదారి దూరమైననూ బస్సులు మండల కేంద్రం నుంచే వెళతాయి. 44 వ నెంబరు మరియు 65 వ నెంబరు జాతీయ రహదారులకు కలిపే షాద్ నగర్-కంది రహదారి ఇక్కడి నుంచే ప్రారంభమౌతుంది. షాద్ నగర్ నుంచి ఆమనగల్ వైపు కూడా రహదారి సౌకర్యం ఉంది. సికింద్రాబాదు-డోన్ రైలుమార్గం కూడా మండలం నుంచి వెళ్ళుచున్నది. షాద్ నగర్, బూర్గులలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి.
ఈ మండలము షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలము నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో ఉండేది. 2001 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన కె.సూర్యప్రకాష్, 2006 జడ్పీటీసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఆకుల సుహాసిని విజయం సాధించారు.చౌలపల్లి ప్రతాపరెడ్డి 1995-2001 కాలంలో షాద్‌నగర్ జడ్పీటీసిగా పనిచేశారు. 2014లో ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎ.బుజ్జి ఎన్నికయ్యారు. విద్యాసంస్థలు: 2008-09 నాటికి మండలంలో 87 ప్రాథమిక పాఠశాలలు (71 మండల పరిషత్తు, 1 ప్రైవేట్ ఎయిడెడ్, 15 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 26 ప్రాథమికోన్నత పాఠశాలలు (15 మండల పరిషత్తు, 1 ప్రైవేట్ ఎయిడెడ్, 10 ప్రైవేట్ అన్-ఎయిడెడ్), 28 ఉన్నత పాఠశాలలు (2 ప్రభుత్వ, 10 జడ్పీ, 16 ప్రైవేట్), 8 జూనియర్ కళాశాలలు (2 ప్రభుత్వ, 6 ప్రైవేట్) ఉన్నవి. అధ్యాత్మికత: షాద్‌నగర్ పట్టణంలో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయం కాకుండా నలుదిక్కులా పేరుపొందిన ఆలయాలున్నాయి. దక్షిణాన రాయికల్‌లో శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం, తూర్పున కన్యకాపరమేశ్వరి ఆలయం, ఉత్తరాన వెంకటేశ్వరస్వామి అలయం, పడమరన పోచమ్మ ఆలయాలు ఉన్నాయి.
మండలం మొత్తం విస్తీర్ణం 26735 హెక్టార్లలో 19% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట వరి. మొక్కజొన్న, కందులు, జొన్నలు, ప్రత్తి కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 721 మిమీ. మండలంలో సుమారు 2900 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది. కాలరేఖ:
|
Tags:Farriqnagar Mandal in telugu, Shadnagar Mandal information in Telugu, Rangareddy Dist Mandals information in Telugu, Burgula in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి