24, జనవరి 2013, గురువారం

ఉట్కూరు మండలము (Utkur Mandal)

జిల్లా నారాయణపేట
రెవెన్యూ డివిజన్ నారాయణపేట
జనాభా54808 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంమక్తల్
లోకసభ నియోజకవర్గంమహబూబ్ నగర్
పర్యాటక ప్రాంతాలు
ముఖ్య పంటలుకందులు, పెసర్లు
మండల ప్రముఖులుఎల్కోటి ఎల్లారెడ్డి,
ఉట్కూరు నారాయణపేట జిల్లాకు చెందిన మండలము. నారాయనపేట - మక్తల్ రహదారి మండలం గుండా వెళ్తుంది. ప్రతిపాదనలో ఉన్న కృష్ణా-వికారాబాదు రైలుమార్గం మండలం నుంచి వెళుతుంది. ఈ మండలము జిల్లాలో పశ్చిమాన కర్ణాటక సరిహద్దులో ఉన్నది. శాననసభ్యుడిగా ఎన్నికైన ఎల్కోటి ఎలారెడ్డి ఈ మండలమునకు చెందినవారు. ఈ మండలము నారాయణపేట రెవెన్యూ డివిజన్, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 54808. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న ఈ మండలం కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో కలిసింది.

సరిహద్దులు:
ఈ మండలమునకు ఉత్తరమున నారాయణపేట మండలము, తూర్పున ధన్వాడ మండలము, దక్షిణమున మక్తల్ మండలము, పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 54808. ఇందులో పురుషులు 27360, మహిళలు 27448. జనాభాలో ఇది జిల్లాలో 34వ స్థానంలో ఉంది.

రవాణా సౌకర్యాలు:
నారాయణపేట నుంచి మక్తల్ వెళ్ళు రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. ప్రతిపాదనలో ఉన్న కృష్ణా-వికారాబాదు రైలుమార్గం మండలం నుంచి వెళుతుంది

చరిత్ర:
ఈ ప్రాంతము లోకాయిపల్లి సంస్థానంలో భాగంగా ఉండేది. లోకాయిపల్లి వారు నిర్మించిన కోట మండల కేంద్రంలో ఇప్పటికీ ఉంది. మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలం ఫిబ్రవరి 17, 2019న ఈ మండలం కొత్తగా ఏర్పాటుచేసిన నారాయణపేట జిల్లాలో కలిసింది.

రాజకీయాలు:
ఈ మండలము మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. ఎల్కోటి ఎల్లారెడ్డి ఉట్కూరు మండల కేంద్రానికి చెందినవారు. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన డి.అరవింద్ కుమార్ ఎన్నికయ్యారు. 2009 శాసనసభ ఎన్నికలలో మండలంలో కాంగ్రెస్ పార్టీకి 8306, తెలుగుదేశం పార్టీకి 7465, భారతీయ జనతా పార్టీకి 4257 ఓట్లు లభించాయి.

మక్తల్ నియోజకవర్గంలో
ఉట్కూరు మండల స్థానం (వంకాయ రంగు)
విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 25 ప్రాథమిక పాఠశాలలు (22 మండల పరిషత్తు, 3 ప్రైవేట్), 13 ప్రాథమికోన్నత పాఠశాలలు (11 మండల పరిషత్తు, 2 ప్రైవేట్), 9 ఉన్నత పాఠశాలలు (1 ప్రభుత్వ, 6 జడ్పీ, 2 ప్రైవేట్), 1 ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది.

అధ్యాత్మికత:
కొల్లూరులో నర్సన్నస్వామితాత దేవాలయం ఉంది. (కుర్వకులస్థుల ఆరాధ్యదైవం).

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 32967 హెక్టార్లలో 50% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట కందులు, పెసర్లు. వరి, జొన్నలు కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 628 మిమీ. మండలంలో సుమారు 1800 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది

(ఉట్కూరు మండలంలోని గ్రామపంచాయతీలు)

ఇవి కూడా చూడండి:
విభాగాలు: నారాయణపేట జిల్లా మండలాలు,  ఉట్కూరు మండలము, నారాయణపేట రెవెన్యూ డివిజన్, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం, 
  • https://narayanpet.telangana.gov.in/ (Narayanapet Dist official website)

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక