24, జనవరి 2013, గురువారం

వెల్దండ మండలము (Veldanda Mandal)

జిల్లా నాగర్‌కర్నూల్
రెవెన్యూ డివిజన్ కల్వకుర్తి
జనాభా
46028 (2011)
అసెంబ్లీ నియోజకవర్గంకల్వకుర్తి
లోకసభ నియోజకవర్గంనాగర్ కర్నూల్
ముఖ్య పంటలుప్రత్తి
వెల్దండ నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలము. హైదరాబాదు-శ్రీశైలం ప్రధాన రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది. ఇది కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్ కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగము. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 46028. మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు, 17 గ్రామపంచాయతీలు కలవు. 2012లో భాజపా తరఫున మహబూబ్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన యెన్నం శ్రీనివాసరెడ్డి, కవి రుక్ముద్దీన్ ఈ మండలమునకు చెందినవారు.
  
సరిహద్దులు:
ఈ మండలమునకు ఉత్తరమున ఆమనగల్, మాడ్గుల మండలములు, తూర్పున మరియు దక్షిణాన వంగూరు మండలము, పశ్చిమాన కల్వకుర్తి, మిడ్జిల్ మండలములు, వాయువ్యాన తలకొండపల్లి మండలము సరిహద్దులుగా ఉన్నాయి. 
 
చరిత్ర:
1948 వరకు ఈ ప్రాంతం నిజాం రాజ్యంలో భాగంగా ఉండేది. హైదరాబాదు విమోచన అనంతరం 1956 వరకు హైదరాబాదు రాష్ట్రంలోనూ, 1956-2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉండేది. 1969 మరియు 2009-14 కాలంలో ఇక్కడ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగింది. 1969లో తెలంగాణ తొలి దశ ఉద్యమంలో వెల్దండ మండల కేంద్రానికి చెందిన టి.మోహన్ సింగ్ లాంటి యువకులు చురుకుగా పాల్గొన్నారు. 2011లో మండల వ్యాప్తంగా 42 రోజుల పాటు సకలజనుల సమ్మె పూర్తిగా విజయవంతమఈంది. 2014 జూన్ 2 న ఈ మండలం తెలంగాణలో భాగమైంది. 2016 వరకు మహబూబ్‌నగర్ జిల్లాలో ఉండగా అక్టోబరు 11, 2016న కొత్తగా ఏర్పడిన నాగర్‌కర్నూల్ జిల్లాలో భాగమైంది.


జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 40798. ఇందులో పురుషులు 20617, మహిళలు 20181.
2011 లెక్కల ప్రకారం మండల జనాభా 46028. ఇందులో పురుషులు 23296, మహిళలు 22732. జనాభాలో ఇది జిల్లాలో 55వ స్థానంలో ఉంది.

రాజకీయాలు:
ఈ మండలము కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2001 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వథ్యావత్ వెంకటయ్య, 2006 ఎంపీటీసి ఎన్నికలలో మండలంలోని 12 స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ 7, తెదేపా 4, భాజపా ఒక స్థానంలో విజయం సాధించాయి. మండల పరిషత్తు అధ్యక్షురాలిగ వసంత ఎన్నికైనది.

రవాణా సౌకర్యాలు:
కల్వకుర్తి నుంచి నల్గొండ వెళ్ళు రహదారి మండలం గుండా వెళ్ళుచున్నది.

కల్వకుర్తి నియోజకవర్గంలో
వెల్దండ మండల స్థానం (పసుపు రంగు)
రాజకీయాలు:
ఈ మండలము కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, నాగర్‌కర్నూల్ లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. 2006 ఎంపీటీసి ఎన్నికలలో మండలంలోని 12 స్థానాలకుగాను కాంగ్రెస్ పార్టీ 7, తెదేపా 4, భాజపా ఒక స్థానంలో విజయం సాధించాయి. మండల పరిషత్తు అధ్యక్షురాలిగ వసంత ఎన్నికైనది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా భాజపా సభ్యుడు రాజీనామా చేశారు. 2006 జడ్పీటీసి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన తాండ్ర రాములమ్మ విజయం సాధించారు.

విద్యాసంస్థలు:
2008-09 నాటికి మండలంలో 60 ప్రాథమిక పాఠశాలలు (2 ప్రభుత్వ, 55 మండల పరిషత్తు, 3 ప్రైవేట్), 9 ప్రాథమికోన్నత పాఠశాలలు (8 మండల పరిషత్తు, 1 ప్రైవేట్), 10 ఉన్నత పాఠశాలలు (2 ప్రభుత్వ, 7 జడ్పీ, 1 ప్రైవేట్) 1 ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది.

వ్యవసాయం, నీటిపారుదల:
మండలం మొత్తం విస్తీర్ణం 31899 హెక్టార్లలో 29% భూమి వ్యవసాయ యోగ్యంగా ఉన్నది. మండలంలో పండించే ప్రధాన పంట ప్రత్తి. వరి, కందులు, మొక్కజొన్న, జొన్నలు కూడా పండిస్తారు. మండల సాధారణ వర్షపాతం 594 మిమీ. మండలంలో సుమారు 2700 హెక్టార్లకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

కాలరేఖ:
  • 2013, మే 30: ఆమనగల్ మండలం మేడిగడ్డతాండావద్ద హైదరాబాదు-శ్రీశైలం ప్రధాన రహదారిపై ఆర్టీసి బస్సు-ఆటో ఢోకొని చెర్కూర్ గ్రామానికి చెందిన నలుగురు మరణించారు. 
  • 2014, జూన్ 2: ఈ మండలం కొత్తగా అవతరించిన తెలంగాణ రాష్ట్రంలో భాగమైంది
  • 2016, అక్టోబరు 11: ఈ మండలం పాలమూరు జిల్లా నుంచి నాగర్‌కర్నూల్ జిల్లాలో భాగమైంది
  •  
వెల్దండ మండల పరిషత్తు కార్యాలయము


సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Mahabubnagar Dist, 2008,
  • Handbook of Census Statistics, Mahabubnagar Dist, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం, 
  • తొలి తెలంగాణం (1969 తెలంగాణ ఉద్యమ శంఖారావం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక