27, మే 2013, సోమవారం

తుంగభద్ర నది (Tungabhadra River)

 తుంగభద్ర నది
జన్మస్థానంకూడ్లి
ప్రవహించు రాష్ట్రాలుకర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
నది పొడవు531 కిమీ
ప్రాజెక్టులుతుంగభద్ర ప్రాజెక్టు
ఉపనదులుతుంగ, భద్ర
సంగమస్థానంసంగమేశ్వరం
కృష్ణానది ఉపనదులలో పెద్దది మరియు ముఖ్యమైనది తుంగభద్ర నది. ఈ నది కర్ణాటకలోని పడమటి కనుమలలో జన్మించిన తుంగ, భద్ర అను రెండు నదుల కలయిక వలన ఏర్పడినది. భౌగోళికంగానే కాకుండా చారిత్రికంగానూ, అధ్యాత్మికంగాను ఈ నదికి ప్రాధాన్యత ఉంది. మధ్యయుగ దక్షిణ భారతదేశ చరిత్రలో వెలిసిన విజయనగర సామ్రాజ్యం ఈ నది ఒడ్డునే వెలిసింది. హంపి, మంత్రాలయం లాంటి పుణ్యక్షేత్రాలు ఈ నది ఒడ్డున వెలిశాయి. ఈ నది పొడవు 531 కిలోమీటర్లు.

పశ్చిమ కనుమలలో జన్మించిన తుంగ, భద్ర నదులు కర్ణాటకలోని శిమోగా జిల్లా కూడ్లి వద్ద సంగమించి తుంగభద్ర నదిగా ఏర్పడుతున్నది. కర్ణాటక నుంచి కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దులో తెలంగాణలో ప్రవేశిస్తున్నది. మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ సమీపంలోని సంగమేశ్వరం వద్ద తుంగభద్ర నది కృష్ణానదిలో కలుస్తుంది.

తుంగభద్రనదిపై తెలంగాణ, కర్టాటక సరిహద్దులో కర్ణాటక భూభాగంలో తుంగభద్ర డ్యాం నిర్మించబడింది. ఇది కర్ణాటకలోని రాయచూరుకు మరియు తెలంగాణ రాష్ట్రం లోని మహబూబ్‌నగర్ జిల్లాకు సాగునీటిని అందిస్తుంది. (కాని కర్ణాటకవారు తెలంగాణకు నీటిని వదలడం లేదు).

ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి దేశంలోని అన్ని పుష్కరనదుల వలె తుంగభద్రనదికి కూడా పుష్కరాలు నిర్వహిస్తారు. చివరిసారిగా ఈ నదికి 2008 డిసెంబరులో పుష్కరాలు 12 రోజులపాటు నిర్వహించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు మరియు తెలంగాణలో మహబూబ్‌నగర్ జిల్లాలలో పుష్కరఘాట్లు ఏర్పాటు చేయబడ్డాయి. ముఖ్యమంత్రిచే పుష్కర ఉత్సవాలు ప్రారంభించబడింది. కర్నూలు జిల్లాలో 17, మహబూబ్‌నగర్ జిల్లాలో 5 పుష్కరఘాట్లు ఏర్పాటుచేశారు.

విభాగాలు: భారతదేశ నదులు, తెలంగాణ నదులు, ఆంధ్రప్రదేశ్ నదులు, మహబూబ్‌నగర్ జిల్లా నదులు, కర్నూలు జిల్లా నదులు, కృష్ణానది, తుంగభద్ర నది,


 = = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
 • జలవనరులు (రచన- సిద్ధాని నాగభూషణం),
 • మహబూబ్‌నగర్ జిల్లా సర్వస్వము (రచన- బి.ఎన్.శాస్త్రి),

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక