31, మార్చి 2014, సోమవారం

ఆలంపూర్ (Alampur)

 ఆలంపూర్ గ్రామము
గ్రామముఆలంపూర్
మండలముఆలంపూర్ 
జిల్లామహబూబ్‌నగర్
జనాభా11271 (2001)
12609 (2011)
ఆలంపూర్ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. రెవెన్యూ గ్రామ వైశాల్యము 5247 హెక్టార్లు. ఇది మేజర్ పంచాయతి కేంద్రము. ప్రముఖ క్షేత్రమైన ఆలంపూర్ మొదట ఇది హమతాపూర్‌గా ప్రసిద్ధి చెందినది. తర్వాత ఇది అమలాపూర్‌గా మారింది. ఇప్పుడు ఆలంపూర్ అయింది. మండలాల వ్యవస్థకు పూర్వం ఇది తాలుకా కేంద్రం. గ్రామం తుంగభద్ర నది తీరాన ఉంది. ఇక్కడ చాళుక్యుల కాలం నాటి పురాతనమైన ఆలయాలున్నాయి. 2008లో తుంగభద్ర నది పుస్కరాలు నిర్వహించబడ్డాయి. తుంగభద్ర నీరు గ్రామంలోకి ప్రవేశించకుండా 1974లో 50 అడుగుల ఎత్తున కరకట్ట నిర్మించారు. 2009 అక్టోబరు వరదల సమయంలో కరకట్టలకు మించి నీరు రావడంతో గ్రామం పూర్తిగా నీటమునిగింది. ఈ గ్రామం కర్నూలు నుంచి 25 కిమీ దూరంలో, జాతీయ రహదారిపై ఉన్న ఆలంపూర్ చౌరస్తా నుంచి 15 కిమీ దూరంలో ఉంది. క్రీ.శ.6వ శతాబ్దిలో బాదామి చాళుక్య రెండో పులకేశి కాలంలో నిర్మించిన ఆలయాలున్నాయి. కాశీ లాంటి ప్రత్యేకతలు కలిగిన క్షేత్రం ఆలంపూర్. సమీపంలో తుంగభద్ర, కృష్ణానదుల సంగమ ప్రాంతం ఉంది.
ఈ క్షేత్రంలో నవబ్రహ్మ ఆలయాలున్నాయి. అవి తారక బ్రహ్మ, స్వర్ణ బ్రహ్మ, విశ్వ బ్రహ్మ, గరుడ బ్రహ్మ, బాల బ్రహ్మ, కుమార బ్రహ్మ, అర్క బ్రహ్మ, వీర బ్రహ్మ, పద్మ బ్రహ్మ ఆలయాలు. ప్రస్తుతం బాల బ్రహ్మ ఆలయం, జోగులాంబ మాత్రమే పూజలందుకుంటున్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 11271. ఇందులో పురుషులు 5802, మహిళలు 5469. గృహాల సంఖ్య 2251.
2011 గణన ప్రకారం గ్రామ జనాభా 12609. ఇందులో పురుషులు 6790, మహిళలు 5819. గృహాల సంఖ్య 2442. అక్షరాస్యత శాతం 62.76%. గ్రామ కోడ్ సంఖ్య 576440.

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా ఏ.జయరాముడు ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు:
ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పలు ప్రాథమిక పాఠశాలలున్నాయి.

జోగుళాంబ దేవాలయం:
తుంగభద్ర నది సమీపంలో అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవదైన శ్రీజోగుళాంబ ఆలయం క్రీ.శ.6వ శతాబ్దిలో చాళుక్యుల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చింది.

రవాణా సౌకర్యాలు:
ఆలంపూర్ గ్రామానికి కర్నూలు నగరం నుంచి బస్సు సౌకర్యం ఉంది. జాతీయ రహదారిపై ఉన్న ఆలంపూర్ చౌరస్తా నుంచి ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉన్నాయి. జోగుళాంబ రైల్వేస్టేషన్ లేదా ఆలంపూర్ రైల్వేస్టేషన్ నుంచి 15 కిమీ రోడ్డు మార్గాన వెళ్ళీ ఆలంపూర్ చేరుకోవచ్చును.

స్థానికపాలన:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో ఆలంపూర్ మేజర్ పంచాయతి సర్పంచిగా జయరాముడు ఎన్నికయ్యారు. నవంబరు 2013లో ఈయన జిల్లా సర్పంచిల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

పురావస్తు మ్యూజియం:

ఆలంపూర్ ఆలయాల సమీపంలోనే పురావస్తు ప్రదర్శనశాల ఉంది. పురాతన కాలం నాటి శిలలు, మూర్తులు, శాసనాలు ఇక్కడ దర్శనమిస్తాయి.

కార్యాలయాలు:
గ్రామపంచాయతి కార్యాలయం, కోర్టు, పోలీస్ స్టేషన్, మండల పరిషత్తు కార్యాలయం, మండల రెవెన్యూ కార్యాలయం, మండల వ్యవసాయ అధికారి కార్యాలయం, తపాలా కార్యాలయం  తదితరాలున్నాయి.

2009 అక్టోబరు వరదలు:
అక్టోబరు 2, 2009న సంభవించిన తుంగభద్ర నది వరదలలో ఈ గ్రామం మొత్తం మునిగిపోయింది. దాదాపు 10 మీటర్లు నీరు నిలవడంతో పురాతన దేవాలయాలు, కార్యాలయాలు, ఇండ్లు, పాఠశాలలు అన్నీ మునిగిపోయాయి. తుంగభద్ర నదికి నిర్మించిన రక్షణగోడ పై నుంచి వరదనీరు రావడంతో గ్రామస్థులందరూ ఊరు వదిలి వారం రోజులవరకు దూరాన రక్షణపొందారు.

విభాగాలు: ఆలంపూర్ మండలంలోని గ్రామాలు


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక