1, జులై 2013, సోమవారం

ఆంధ్రప్రదేశ్ వార్తలు-2011 (Andhra Pradesh News-2011)


ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2011జాతీయ వార్తలు-2011అంతర్జాతీయ వార్తలు-2011క్రీడావార్తలు-2011

ఆంధ్రప్రదేశ్ వార్తలు-2011 (Andhra Pradesh News-2011)
  • 2011, జనవరి 2: ప్రముఖ గేయ రచయిత గుండవరపు సుబ్బారావు మరణించారు.
  • 2011, జనవరి 6: గుంటూరు సన్నమిర్చికి భౌగోళిక గుర్తింపు లభించింది.
  • 2011, జనవరి 26: అక్కినేని నాగేశ్వరారావు, పల్లె రామారావులకు పద్మవిభూషణ్ అవార్డులు లభించాయి.
  • 2011,జనవరి 26: తెలుగు నవల "కాలుతున్న పూలతోట"కు 2010 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
  • 2011,ఫిబ్రవరి 3: జె.వి.రాఘవులుకు ఘంటశాల పురస్కారం లభించింది.
  • 2011, మార్చి 26: సీపీఐ నాయకుడు బొమ్మగాని ధర్మభిక్షం మరణించారు. 
  • 2011, ఏప్రిల్ 1: చిత్తూరు జిల్లా శతాబ్ది ఉత్సవాలను నిర్వహించారు.
  • 2011, మార్చి 30: తెలుగు సినీనటుడు నూతన్ ప్రసాద్ మరణించారు.
  • 2011, ఏప్రిల్ 6: సినీనటి సుజాత మరణించారు.
  • 2011, ఏప్రిల్ 14: సినీనటుడు గంగసాని రామిరెడ్డి మరణించారు.
  • 2011, ఏప్రిల్ 24: అధ్యాత్మిక ప్రముఖుడు సత్యసాయిబాబా శివైక్యం చెందారు.
  • 2011, మే 14: ప్రముఖ మానవహక్కుల నేత బుర్రా రాములు మరణించారు.
  • 2011, మే 19: శ్రీకాకుళం జిల్లా దన్నానపేట పాండవుల మెట్టపై ఇన్య్పయుగపు అతిపెద్ద సమాధిని పురావస్తుశాఖ గుర్తించింది.
  • 2011, మే 19: రైతు ఉద్యమనేత మాసీమ రాజగోపాలరెడ్డి మరణించారు.
  • 2011, జూన్ 6: రాష్ట్ర పీసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ నియమించబడ్డారు.
  • 2011, జూన్ 24: రాష్ట్రంలో కొత్తగా 2 కార్పోరేషన్లు అవతరించాయి (ఒంగోలు, చిత్తూరు).
  • 2011, జూన్ 30: ఆంధ్రప్రదేశ్ డిజిపిగా వి.దినేష్ రెడ్డి నియామకం.
  • 2011, జూన్ 30: 20 సూత్రాల అమలులో ఆంధ్రప్రదేశ్ జాతీయస్థాయిలో మొదటిస్థానంలో నిలిచింది.
  • 2011, జూలై 13: రేడియో తాతయ్యగా పేరుపొందిన మల్లంపల్లి ఉమామహేశ్వరరావు మరణించారు.
  • 2011, జూలై 16: కడప జిల్లా తుమ్మలపల్లిలో యురేనియం నిక్షేపాలు కనుగొన్నారు.
  • 2011, జూలై 23: ద్రోణవల్లి హారికకు గ్రాండ్‌మాస్టర్ హోదా లభించింది.
  • 2011, ఆగస్టు 3: సాహితీవేత్త వేగుంట మోహనప్రసాద్ మరణించారు.
  • 2011, ఆగస్టు 18: రాష్ట్రానికి చెందిన బాక్సింగ్ కోచ్ ఇనుకుర్తి వెంకటేశ్వరరావుకు ద్రోణాచార్య అవార్డు లభించింది.
  • 2011,ఆగస్టు 26: తమిళనాడు గవర్నరుగా రాష్ట్రానికి చెందిన కె.రోశయ్య నియమించబడ్డారు.
  • 2011, సెప్టెంబరు 2: ప్రముఖ రచయిత నండూరి రామ్మోహనరావు మరణించారు.
  • 2011, సెప్టెంబరు 3: ప్రముఖ పారిశ్రామికవేత్త ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ మరణించారు.
  • 2011, అక్టోబరు 9: రాష్ట్ర మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు మరణించారు.
  • 2011, అక్టోబరు 14: సినీగేయ రచయిత జాలాది రాజారావు మరణించారు.
  • 2011, అక్టోబరు 23: బాపట్లలో శ్రీభావ నారాయణస్వామి ఆలయ గోపురం కూలిపోయింది.
  • 2011, అక్టోబరు 28: రచయిత అవసరాల రామకృష్ణారావు మరణించారు.
  • 2011, డిసెంబరు 5: రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాసతీర్మానం వీగిపోయింది.
  • 2011, డిసెంబరు 10: సినీ నిర్మాత, గేయ రచయిత మల్లెమాల సుందర రామిరెడ్డి మరణించారు.

ఇవి కూడా చూడండి: ఆంధ్రప్రదేశ్ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2012, 2013,



 = = = = =

విభాగాలు: ఆంధ్రప్రదేశ్ వార్తలు, 2011, 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక