3, జులై 2013, బుధవారం

కె.చంద్రశేఖర్ రావు (K.Chandrashekar Rao)

 కె.చంద్రశేఖర్ రావు
జననం17 ఫిబ్రవరి, 1954
స్వస్థలంచింతమడక (మెదక్ జిల్లా)
పదవులుతెలంగాణ ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి,
నియోజకవర్గంసిద్ధిపేట అ/ని (1985-2004), కరీంనగర్ లో/ని (2004-09), మహబూబ్‌నగర్ లో/ని (2009-14)
మెదక్ లో/ని (2014- )
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపకుడు అయిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు 17 ఫిబ్రవరి, 1954న మెదక్ జిల్లా సిద్ధిపేట మండలం చింతమడక గ్రామంలో జన్మించారు. ప్రారంభంలో తెలుగుదేశం పార్టీలో ఉంటూ కొంతకాలం డిప్యూటి స్పీకరుగా పదవి నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నేపథ్యంతో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటుచేశారు. కేంద్రమంత్రిగానూ పనిచేశారు. 2014, జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించారు.

రాజకీయ నేపథ్యం:
1983లో శాసనసభ స్థానానికి పోటీచేసి పరాజయం పొందారు. 1985, 1989లలో తెలుగుదేశం పార్టీ తరఫున సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. రాష్ట్ర శాసనసభ డిప్యూటి స్పీకరుగా కొంతకాలం పనిచేశారు. ఏప్రిల్ 27, 2001న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటుచేశారు. 1994, 1999, 2001 ఉప ఎన్నికలలో సిద్దిపేట నుంచే తెరాస తరఫున విజయం సాధించారు. 2004, 2006 ఉప ఎన్నిక, 2008 ఉప ఎన్నికలో కరీంనగర్ లోకసభ స్థానం నుంచి, 2009లో మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కేంద్రప్రభుత్వంలో కొంతకాలం మంత్రిపదవిని నిర్వహించారు. 2014లో మెదక్ లోకసభ నియోజకవర్గంలోనూ, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం లోనూ విజయం సాధించారు. తెలంగాణలో తెరాసకు మెజారిటీ సీట్లు రావడంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవి పొందారు.

కుటుంబం:
చంద్రశేఖరరావు స్వాతంత్ర్యసమరయోధుడైన జె.కేశ్వరావు కూతురు శోభను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు మరియు ఒక కూతురు. కుమారుడు కల్వకుంట్ల తారకరామారావు సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. కూతురు కవిత తెలంగాణ రాష్ట్ర సమితిలో చురుకైన పాత్ర వహిస్తు 2014లో నిజామాబాదు నుంచి లోకసభకు ఎన్నికయ్యారు. మేనల్లుడు హరీష్ రావు ప్రస్తుతం సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఇవి కూడా చూడండి:

విభాగాలు: మెదక్ జిల్లా రాజకీయ నాయకులు, సిద్ధిపేట మండలము, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం, కరీంనగర్ లోకసభ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోకసభ నియోజకవర్గం, కేంద్రమంత్రులు, 1954,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక