కుంటాల నిర్మల్ జిల్లాకు చెందిన మండలము.ఈ మండలము 19° 10' 45'' ఉత్తర అక్షాంశం మరియు 78° 06' 16'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. మండలానికి ఉత్తర దిశలో సహ్యాద్రి పర్వతశ్రేణులు కనిపిస్తాయి. ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దును కలిగియుంది. చాక్ పల్లి పంచాయతి పరిధిలో పురాతనమైన డోంగుర్ గాం సిద్దేశ్వరాలయం ఉంది. మండలంలో 7 ఎంపీటీసి స్థానాలు, 15 గ్రామపంచాయతీలు, 16 రెవెన్యూ గ్రామాలు కలవు. అక్టోబరు 11, 2016న కుంటాల మండలంలోని 12 రెవెన్యూ గ్రామాలను కొత్తగా ఏర్పడిన నర్సాపూర్ మండలంలో విలీనం చేశారు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ ప్రాంతం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: కుంటాల మండలానికి తూర్పున నర్సాపూర్ మండలం, దక్షిణాన లోకేశ్వరం మండలం, పశ్చిమాన భైంసా మండలం మరియు కుభీర్ మండలాలు, ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 28832. ఇందులో పురుషులు 14112, మహిళలు 14720. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 34121. ఇందులో పురుషులు 16648, మహిళలు 17473. రాజకీయాలు: ఈ మండలం ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. శాసనసభ్యుడిగా పనిచేసిన నారాయణరావు ఈ మండలానికి చెందినవారు.
కుంటాల మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Ambagaon, Ambakanti, Andkur, Downelly, Kallur, Kuntala, Limba (Buzurg), Limba (Khurd), Medanpur, Ola, Penchikalpahad, Raipahad, Rajapur, Suryapur, Venkur, Vittapur
ప్రముఖ గ్రామాలు
కుంటాల (Kuntala): కుంటాల నిర్మల్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇక్కడ గ్రామదేవత గజ్జాలమ్మ ఆలయం ఉంది. నీటి కుంటలో విగ్రహం లభించగా అమ్మవారు కలలో కనిపించి తాను గజ్జాలమ్మనని తనకు గుడి కట్టాలని చెప్పినట్లు కథ ప్రచారంలో ఉంది. ప్రతి ఆదివారం ఆలయం కిటకిటలాడుతుంది. 2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4150. మండలంలో అత్యధిక జనాభా కల గ్రామం..
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Kuntala Mandal, Nirmal Dist (district) Mandal in telugu, Nirmal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి