భైంసా నిర్మల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము 19° 06' 38'' ఉత్తర అక్షాంశం మరియు 77° 58' 10'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. ఇది నిర్మల్ జిల్లాలో పశ్చిమాన ఉంది. 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 75768. మండల విస్తీర్ణం 22096 హెక్టార్లు. భైంసా పట్టణ సమీపంలో గడ్డెన్న సుద్దవాగు ప్రాజెక్టు నిర్మించారు. కూచిపూడి నాట్యంలో అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందిన రాధ, కౌసల్య (రాజారెడ్డి భార్యలు), కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్ససలర్ గా పనిచేసిన చంద్రకాంత కొకాటే ఈ మండలానికి చెందినవారు.మండలంలో 11 ఎంపీటీసి స్థానాలు, 30 గ్రామపంచాయతీలు, 34 రెవెన్యూ గ్రామాలు కలవు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ ప్రాంతం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: భౌగోళికంగా ఈ మండలం నిర్మల్ జిల్లాలో పశ్చిమాన ఉంది. ఈ మండలానికి ఉత్తరాన కుభీర్ మండలం, తూర్పున కుంటాల మండలం మరియు నర్సాపూర్ మండలం, ఆగ్నేయాన లోకేశ్వరం మండలం, దక్షిణాన ముధోల్ మండలం, పశ్చిమాన తానూర్ మండలం సరిహద్దులుగా ఉన్నాయి. చరిత్ర: ఆంధ్రప్రదేశ్ అవతరణకు పూర్వం ఈ మండలం నాందేడ్ జిల్లాలో భాగంగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ అవతరణ అనంతరం ముధోల్ తాలుకాలో భాగంగా మారింది. 1986లో ప్రత్యేక మండలంగా ఏర్పడింది. అక్టోబరు 11, 2016కు ముందు ఈ ప్రాంతం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. 2016 జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో భాగమైంది. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 75768. ఇందులో పురుషులు 38233, మహిళలు 37535. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 89660. ఇందులో పురుషులు 44901, మహిళలు 44759. పట్టణ జనాభా 50013 కాగా గ్రామీణ జనాభా 39647. రాజకీయాలు: ఈ మండలం ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. శాసనసభ్యుడిగా పమిచేసిన నారాయణరావు ఈ మండలానికి చెందినవారు.
భైంసా మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Babalgaon, Badgaon, Bhainsa (M), Bijjur, Boregaon (Buzurg), Chichond, Chintalabori, Dahegaon, Ekgaon, Elegaon, Gundagaon, Hampoli Khurd, Hasgul, Kamol, Khatgaon, Kotalgaon, Kumbhi, Kumsari, Linga, Mahagaon, Manjri, Mategaon, Mirzapur, Pangri, Pendapalle, Pipri, Siddur, Sirala, Sunkli, Takli, Thimmapur, Walegaon, Wanalpahad, Watoli
ప్రముఖ గ్రామాలు
భైంసా (Bhainsa): భైంసా నిర్మల్ జిల్లాకు చెందిన పట్టణము మరియు మండల కేంద్రము. ఇది నిర్మల్ జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఉంది. ఈ పట్టణం మున్సీపాలిటీగా ఉంది. భైంసా అసలునామం మహిషాపురం. రూపాంతరం చెంది మైస, భైంసాగా మారింది. ఈ ప్రాంతంలోనే మహిషాసురుడు అంతమొనర్చబడినట్లు పురాణాల ప్రకారం తెలుస్తుంది. చారిత్రక కాలంలో నిర్మించబడ్డ పెద్ద దేవాలయాలు, మహిషాసురుని పెద్ద విగ్రహం శిథిలమైన అవశేషాలు అక్కడక్కడ కనిపిస్తాయి. మండల వ్యవస్థకు పూర్వం ఇది ముధోల్ తాలుకాలో ఉండేది. 1986లో ప్రత్యేకంగా మండల కేంద్రమైనది. భైంసాలోని మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జిల్లాలోనే అతి పురాతనమైనది. భైంసాలో ఆర్టీసి డిపో, మార్కెటింగ్ కమిటీ ఉన్నాయి. బడ్‌గాం (Badgam): బడ్‌గాం నిర్మల్ జిల్లా భైంసా మండలానికి చెందిన గ్రామము. మాజీ శాసనసభ్యుడు నారాయణరావు పటేల్ స్వగ్రామం. దేగామ్ (Degam): దేగామ్ నిర్మల్ జిల్లా భైంసా మండలమునకు చెందిన గ్రామము. ప్రముఖ రాజకీయనాయకుడు గడ్డెన్న స్వగ్రామం. గడ్డెన్న కుమారుడు విఠల్ రెడ్డి కూడా రాజకీయాలలో ఉన్నారు. సుధానదిపై నిర్మించిన ప్రాజెక్టుకు గడ్డెన్న పేరు పెట్టబడింది. కోతులగామ్ (Kotulagam): కోతులగామ్ ఆదిలాబాఉద్ జిల్లా భైంసా మండలమునకు చెందిన గ్రామము. అంతర్జాతీయస్థాయి నాట్య కళాకారుడు భార్యలు రాధ, కౌసల్యలు ఈ గ్రామానికి చెందినవారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Bhainsa Mandal, Nirmal Dist (district) Mandal in telugu, Nirmal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి