16, ఆగస్టు 2019, శుక్రవారం

కుభీర్ మండలం (Kubeer Mandal)

కుభీర్ మండలం
జిల్లా నిర్మల్ జిల్లా
రెవెన్యూ డివిజన్ భైంసా
అసెంబ్లీ నియోజకవర్గంముధోల్
లోకసభ నియోజకవర్గంఆదిలాబాదు
కుభీర్ నిర్మల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము 19° 15' 40'' ఉత్తర అక్షాంశం మరియు 77° 56' 47'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. ఇది నిర్మల్ జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. ఆదిలాబాదు జిల్లా పరిషత్తు తొలి చైర్మెన్ గా పనిచేసిన పల్సీకర్ రంగారావు ఈ మండలమునకు చెందినవారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన విలాస్ రావు దేశ్ ముఖ్ ఈయన అల్లుడు. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 41 గ్రామపంచాయతీలు, 38 రెవెన్యూ గ్రామాలు కలవు.

అక్టోబరు 11, 2016కు ముందు ఈ ప్రాంతం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో భాగమైంది.

భౌగోళికం, సరిహద్దులు:
కుభీర్ మండలము జిల్లాలో  పశ్చిమ భాగంలో మహారాష్ట్ర సరిహద్దులో ఉంది.  ఈ మండలమునకు దాదాపు 3 వైపులా మహారాష్ట్రకు చెందిన నాందేడ్ జిల్లా  సరిహద్దుగా ఉన్నది. ఆగ్నేయాన కుంటాల మండలం, దక్షిణాన భైంసా, తానూరు మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.

చరిత్ర:
ఆంధ్రప్రదేశ్ అవతరణకు పూర్వం ఈ ప్రాంతం నాందేడ్ జిల్లాలో భాగంగా ఉండేది. రాష్ట్రావతరణ అనంతరం ముధోల్ తాలుకాలో చేరింది. 1986లో ప్రత్యేక మండలంగా మారింది. కుభీర్‌లో 2 పెద్ద గడీలున్నాయి. ఇవి దేశ్‌ముఖ్‌లు, దేశ్‌పాండ్యాలకు సంబంధించినవి. 2014లో తెలంగాణ రాష్ట్రంలో భాగమైంది. 2016 జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో ఆదిలాబాదు జిల్లా నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో భాగమైంది.

జనాభా:
2001 లెక్కల ప్రకారం మండల జనాభా 27936. ఇందులో పురుషులు 19206 మరియు మహిళలు 19396. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 47928. ఇందులో పురుషులు 23851, మహిళలు 24077.

రాజకీయాలు:
ఈ మండలం ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. శాసనసభ్యుడిగా పనిచేసిన నారాయణరావు ఈ మండలానికి చెందినవారు.

భైంసా మండలం  కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:
Antharni, Bakot, Belgaon, Brahmeswar, Chata, Chondi, Darkubeer, Dodarna, Godapur, Godsera, Halda, Hampli (Buzurg), Jamgaon, Jumda, Khasra, Kubeer, Kupti, Lingi, Malegaon, Marlagonda, Mola, Nandapahad, Nighwa, Palsi, Pangra, Pardi (Buzurg), Pardi (Khurd), Rajura, Ranjani, Sangvi, Sanwali, Shivani, Sirpalle, Sonari, Sowna, Varni, Veeragohan, Wai



ప్రముఖ గ్రామాలు
బ్రహ్మేశ్వర్ (Brahmeshwar):
బ్రహ్మేశ్వర్ నిర్మల్ జిల్లా కుభీర్ మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామ సమీపంలో పురాతనమైన బ్రహ్మేశ్వరాలయం ఉంది. సీతారామలక్ష్మణులు సందర్శించిన ప్రాంతంగా దీనికి పేరుంది. 
జాంగావ్ (Jangaov):
జాంగావ్ నిర్మల్ జిల్లా కుభీర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది అధ్యాత్మిక గ్రామంగా ప్రసిద్ధి చెందింది. రాష్ట్రంలోనే తొలి అధ్యాత్మిక అమృతాలయం ఈ గ్రామంలోనే నిర్మించారు. గ్రామస్థులు మద్యమాంసాలకు దూరంగా ఉంటారు. 1984 తర్వాత గ్రామంలో మార్పు వచ్చింది. గుజరాత్ నుంచి వచ్చిన శ్రీకృష్ణ భక్తులు (స్వాధ్వాయి కార్యకర్తలు) ఇందుకు కారణం.
కుభీర్ (Kubhir):
కుభీర్ నిర్మల్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇది పత్తి వ్యాపారానికి ప్రసిద్ధి. జూనియర్ కళాశాల, బాలికల ఆశ్రమ పాఠశాల, ఒక జడ్పీ పాఠశాల రెండు ప్రాథమిక పాఠశాలలున్నాయి. కుభీర్ లో 400 సం.ల క్రితంనాటి విఠలేశ్వర ఆలయం ఉంది. కార్తీక మాసంలో ఉత్సవాలు జరుగుతాయి.
పల్సీ (Palsi):
పల్సీ నిర్మల్ జిల్లా కుభీర్ మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామానికి చెందిన రంగారావు పల్సీకర్ జిల్లా పరిషత్తు తొలి చైర్మెన్‌గా పనిచేశారు. ఈయన కూతురు మహారాష్ట్ర ముఖ్యమంత్రి విఠల్ రావు దేశ్‌ముఖ్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. ఈ గ్రామంలో ఓ పురాతన జిన్నింగ్ మిల్లు ఉంది.
రంగారావ్ పల్సీకర్ అల్లుడు విలాస్ రావ్ దేశ్ ముఖ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా , కేంద్రమంత్రిగా పనిచేసారు. విలాస్ రావ్ దేశ్ ముఖ్ రెండో కొడుకు రితేష్ దేశ్ ముఖ్ పలు హిందీ (బాలివుడ్) సినిమాల్లో హీరో గా నటించాడు (జెనీలియా భర్త). పెద్ద కుమారుడు అమిత్ దేశ్‌ముఖ్ మహారాష్ట్ర శాసనసభ్యుడిగా పనిచేశారు.
పార్డి (బి) (Pardi B):
పార్డి-బి నిర్మల్ జిల్లా కుభీర్ మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ వందల ఏళ్ళ నాటి రాజరాజేశ్వరస్వామి ఆలయం ఉంది. గ్రామంలో దేవుడి పెళ్ళి తర్వాతే ఇళ్ళలో శుభకార్యాలు నిర్వహిస్తారు. గ్రామంలో శివుని పేరుతో చాలా మంది ఉంటారు. ఇంట్లో ఒక్కనికైనా పేరులో శివ ఉంటుంది.
సిర్పెలి (Sirpelli):
సిర్పెల్లి నిర్మల్ జిల్లా కుభీర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నది. ఇక్కడికి 4 కిమీ దూరంలో మహారాష్ట్రలోని పాలజ్ గ్రామంలో ఏటా వినాయక ఉత్సవాల సందర్భంగా కర్ర వినాయకునికి 11 రోజులు పూజలు జరుపుతారు. ఆ తర్వాత వినాయకునికి నిమజ్జనం జరుపక ఆలయంలో భద్రపరుస్తారు. దాదాపు 6 దశాబ్దాలుగా ఈ పద్దతి కొనసాగుతోంది.

ఇవి కూడా చూడండి:


ఫోటో గ్యాలరీ
c
c
c c


హోం
విభాగాలు: నిర్మల్ జిల్లా మండలాలు,  కుభీర్ మండలము,
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
  • Handbook of Statistics, Adilabad Dist, 2012,
  • Handbook of Census Statistics, Adilabad District, 2001,
  • Census of India 2011, Provistional Population Totals, Part 2, Volume 2 of 2011.
  • బ్లాగు రచయిత సందర్శించి తెలుసుకున్న, సేకరించిన సమాచారం,
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ GO Ms No 223 తేది: 11-10-2016 
  • ఆదిలాబాదు జిల్లా స్వాతంత్ర్యసమరయోధుల చరిత్ర,
  • http://nirmal.telangana.gov.in/ (Official Website of Nirmal Dist),


Kubheer or Kubeer Mandal, Nirmal Dist (district) Mandal in telugu, Nirmal Dist Mandals in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక