లోకేశ్వరం నిర్మల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము 19° 01' 52'' ఉత్తర అక్షాంశం మరియు 78° 05' 02'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. మండలంలో పురాతనమైన బ్రహ్మేశ్వరాలయం ఉంది. మండలానికి దక్షిణ సరిహద్దుగా గోదావరి నది ప్రవహిస్తుంది. మండలంలో 10 ఎంపీటీసి స్థానాలు, 25 గ్రామపంచాయతీలు, 31 రెవెన్యూ గ్రామాలు కలవు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ ప్రాంతం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: నిర్మల్ జిల్లాలో పశ్చిమ భాగంగా ఈ మండలం ఉంది. ఈ మండలానికి తూర్పున దిలావార్‌పూర్ మండలం, పశ్చిమాన ముధోల్ మండలం, వాయువ్యాన భైంసా మండలం, ఉత్తరాన కుంటాల మండలం మరియు నర్సాపూర్ మండలం, దక్షిణాన గోదావరి నది దానికి ఆవల నిజామాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జనాభా: 2001 లెక్కల ప్రకారం మండల జనాభా 31197. ఇందులో పురుషులు 14924, మహిళలు 16273. 2011 లెక్కల ప్రకారం మండల జనాభా 34154. ఇందులో పురుషులు 16317, మహిళలు 17387. స్త్రీపురుష నిష్పత్తి (1000:1093). రాజకీయాలు: ఈ మండలం ముధోల్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. శాసనసభ్యుడిగా పనిచేసిన నారాయణరావు ఈ మండలానికి చెందినవారు.
లోకేశ్వరం మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Abdullapur, Bamni (K), Bhagapur, Biloli, Brahmeshwar, Dharmara, Gadchanda, Godsera, Hadgaon, Hawarga, Joharpur, Kankapur, Kistapur, Lohesra, Malkapur, Manmad, Mohalla, Nagar, New Raipur (K) R.C, Panchgudi, Pipri, Potpalle (B), Potpalle (M), Puspur, Raipur K, Rajura, Sathgaon, Savargaon, Wastapur, Watoli, Yeddur
ప్రముఖ గ్రామాలు
గడ్‌చాందా (Gadchanda): గడ్‌చాందా నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలమునకు చెందిన గ్రామము. ఇది చారిత్రక ప్రాధాన్యత కల గ్రామము. పాత గ్రామమంతా పోచంపాడు ప్రాజెక్తులో ముంపునకు గురవడం వల్ల కొత్త గ్రామం వెలిసింది. లోకేశ్వరం (Lokeshawaram): లోకేశ్వరం నిర్మల్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇక్కడ వెలసిన లోకేశ్వరుడు దైవం వల్ల ఈ పేరు స్థిరపడింది. లోకేశ్వరంలో వందల ఏళ్ళ క్రితం నిర్మించిన భగీరథ చెరువు ఉంది. మండలంలో ఇది విశాలమైన చెరువు. సుమారు 200 ఎకరాలకు సాగునీరు అందుతుంది. చెరువుకట్టపై ఆంజనేయస్వామి గుడి ఉంది. వస్తాపూర్ (Wastapur): వస్తాపూర్ నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలమునకు చెందిన గ్రామము. ఇది గోదావరి తీరంలో ఉంది. 2015 గోదావరి పుష్కరాల సమయంలో ఇక్కడ ఘాట్ ఏర్పాటుచేశారు.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Lokeshwaram Mandal, Nirmal Dist (district) Mandal in telugu, Nirmal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి