(ఇది నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలమునకు చెందిన వ్యాసము. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండల వ్యాసం కోసం ఇక్కడ చూడండి) సారంగాపూర్ నిర్మల్ జిల్లాకు చెందిన మండలము. ఈ మండలము 19° 12' 26'' ఉత్తర అక్షాంశం మరియు 78° 15' 80'' తూర్పు రేఖాంశంపై ఉన్నది. మండలంలో స్వర్ణ ప్రాజెక్టు ఉంది. జడ్పీ చైర్మెన్‌గా, రాష్ట్ర మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసిన ప్రొద్దుటూరి నర్సారెడ్డి ఈ మండలానికి చెందినవారు. ఈ మండలము నిర్మల్ రెవెన్యూ డివిజన్, నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉన్నది. మండలంలో 14 ఎంపీటీసి స్థానాలు, 32 గ్రామపంచాయతీలు, 27 రెవెన్యూ గ్రామాలు కలవు. మండల పరిధిలోని చించోలి(బి) వద్ద తెలంగాణలోనే తొలి కోతుల సంరక్షణకేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అక్టోబరు 11, 2016కు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: సారంగాపూర్ మండలం నిర్మల్ జిల్లాలో ఉత్తరాన ఆదిలాబాదు జిల్లా సరిహద్దులో ఉంది. ఈ మండలానికి తూర్పున నిర్మల్ గ్రామీణ మండలం, దక్షిణాన దిలావర్‌పూర్ మండలం, పశ్చిమాన నర్సాపూర్ మండలం, ఉత్తరాన ఆదిలాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.. రాజకీయాలు: ఈ మండలము నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉంది. జడ్పీ చైర్మెన్‌గా, రాష్ట్ర మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసిన ప్రముఖ రాజకీయ నాయకుడు ప్రొద్దుటూరి నర్సారెడ్డి ఈ మండలానికి చెందినవారు.
సారంగాపూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Adelli, Aloor, Bagirthapur, Beeravelli, Boregaon, Chincholi (Buzurg), Chincholi (Malak), Dhani, Godsera, Gopalpet, Jam, Jewly, Kamkati, Karji, Kowtla (Buzurg), Kupti, Lakshmipur, Nagapur, Pendaldhari, Ponkur, Potia, Pyaramur, Sarangpur, Thandra, Vaikuntapur, Vanjar, Yakarpalle
ప్రముఖ గ్రామాలు
అడెల్లి (Adelli): అడెల్లి నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామంలో మహాపోచమ్మ ఆలయం ఉంది. చించోళి (బి) (Chincholi - B):
చించోళి (బి) నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామం వద్ద తెలంగాణలో తొలిసారిగా, దేశంలోనే రెండోదైన కోతుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కోతుల సంఖ్యను పరిమితం చేయడానికి కోతులకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స కూడా ఈ కేంద్రంలో చేస్తారు. చించోలి -ఎం (Chincholi -M): చించోలి నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలమునకు చెందిన గ్రామము. 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి నిర్వహించి, ఎంపీగానూ విజయం సాధించిన ప్రొద్దుటూరి నర్సారెడ్డి ఈ గ్రామమునకు చెందినవారు. కౌట్ల-బి (Kautla-B): కౌట్ల-బి నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలమునకు చెందిన గ్రామము. ఇది వ్యవసాయికంగా అభివృద్ధి చెందింది. 2003లో గ్రామస్థులు పరస్పర సహాయక సహకార పొదుపు సంఘం ఏర్పాటుచేసుకున్నారు. 2005లో జంషెడ్జీ టాటా జాతీయ మ్యూచువల్ అకాడమీ వారు గ్రామీణాభివృద్ధి పథకం కింద సంఘానికి అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఉత్తమ పురస్కారం అందించారు. ఈ సంఘం పనితీరును హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్.స్వామినాథన్ అభినందించారు. గ్రామస్థులు కలిసికట్టుగా బాబా ఆలయాన్ని నిర్మించుకున్నారు. సారంగాపూర్ (Sarangapur): సారంగాపూర్ నిర్మల్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. మండల కేంద్రానికి 2 కిమీ దూరంలో మహాపోచమ్మ దేవాలయం ఉంది. దసరాకు ముందు మహాలయ అమవాస్య తర్వాత వచ్చే శని, ఆది వారాలలో జాతర నిర్వహిస్తారు.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Sarangapur Mandal, Nirmal Dist (district) Mandal in telugu, Nirmal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి