నర్సాపూర్ నిర్మల్ జిల్లాకు చెందిన మండలము. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది. దిలావర్‌పూర్ మరియు కుంటాల మండలంలోని 21 రెవెన్యూ గ్రామాలతో ఈ మండలాన్ని ఏర్పాటుచేశారు. మండలంలో 7 ఎంపీటీసి స్థానాలు, 13 గ్రామపంచాయతీలు, 21 రెవెన్యూ గ్రామాలు కలవు. అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన నాట్యకళాకారులు రాజారెడ్డి, రాధారెడ్డిలు ఈ మండలమునకు చెందినవారు.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ ప్రాంతం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో భాగమైంది. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి తూర్పున సారంగాపూర్ మండలం మరియు దిలావర్‌పూర్ మండలం, దక్షిణాన నిజామాబాదు జిల్లా, నైరుతిన లోకేశ్వరం మండలం, పశ్చిమాన కుంటాల మండలం, ఉత్తరాన మహారాష్ట్ర సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలము నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉంది.
నర్సాపూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Anjani, Arli (K), Bamni (B), Burgupalli (K), Burugupalli - G, Chackpalli, Cherlapalle, Daryapur, Dongargaon, Gulmadaga, Kusli, Muthakapalli, Nandan, Narsapur, Naseerabad, Rampur, Shakapur (?), Tekulpahad, Temborni, Thurati, Velugudari
ప్రముఖ గ్రామాలు
చాక్ పల్లి (Chakpally): చాక్ పల్లి నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలమునకు చెందిన గ్రామము. చాక్ పల్లి పంచాయతి పరిధిలో పురాతనమైన డోంగుర్ గాం సిద్దేశ్వరాలయం ఉంది. ఇది పురాతనమైన శివాలయం. జాతీయ రహదారి నుంచి 3 కిమీ లోపలికి ఉంది. 500 సం.ల క్రితం నవసిద్ధులు, మునీశ్వరులు ఇక్కడ ఉన్న కోనేరులో తపస్సు చేసేవారని చెబుతారు. నర్సాపూర్ (Narsapur): నర్సాపూర్ నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలమునకు చెందిన గ్రామము. అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన నాట్యకళాకారులు రాజారెడ్డి, రాధారెడ్డిలు ఈ గ్రామానికి చెందినవారు. రాజారెడ్డి మరోభార్య కౌసల్యా రెడ్డి కూడా నాట్యకళారిణి. వీరి కుమారైలు యామినీరెడ్డి, భావనారెడ్డిలు కూడా నాట్యకళాఖారిణులుగా రాణిస్తున్నారు. నర్సాపూర్ (జి) (Narsapur G): గాజుల నర్సాపూర్ నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలమునకు చెందిన గ్రామము. స్వాతంత్ర్యానికి పూర్వం ఇది తాలుకా కేంద్రంగా ఉండేది. ఇది గాజుల తయారీకి ప్రసిద్ధి చెందినది. ఈ గ్రామంలో రాజుల కాలంలో నిర్మించిన చెరువు (దేవుని చెరువు) ఉంది. రాజుల కాలంలో ఏర్పాటు చేసిన మత్తడి ఇంకా చెక్కుచెదరకుండా ఉంది. రాజుల కాలంలో అక్కడ ఆలయం ఉన్నట్లు శిథిలాల ద్వారా తెలుస్తుంది. తింబరేణి (Timbareni): తింబరేణి నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలమునకు చెందిన గ్రామము. 2015 గోదావరి పుష్కరాల సమయంలోఇక్కడ వద్ద పుష్కరఘాట్ ఏర్పాటుచేశారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Narsapur (Nirmal) Mandal, Nirmal Dist (district) Mandal in telugu, Nirmal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి