దిలావర్‌పూర్ నిర్మల్ జిల్లాకు చెందిన మండలము. మండలంలో 6 ఎంపీటీసి స్థానాలు, 17 గ్రామపంచాయతీలు, 15 రెవెన్యూ గ్రామాలు కలవు. కదిలిలో పాపహరేశ్వరాలయం, కాల్వ అడవుల్లో శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఉన్నాయి.
అక్టోబరు 11, 2016కు ముందు ఈ ప్రాంతం ఆదిలాబాదు జిల్లాలో ఉండేది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లాలో భాగమైంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో దిలావర్‌పూర్ మండలంలోని 9 రెవెన్యూ గ్రామాలు కొత్తగా ఏర్పడిన నర్సాపూర్ మండలంలో, ఒక గ్రామాన్ని సోన్ మండలంలో విలీనం చేశారు. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి ఉత్తరాన సారంగాపూర్ మండలం, తూర్పున నిర్మల్ గ్రామీణ మండలం, పశ్చిమాన నర్సాపూర్ మండలం, దక్షిణాన నిజామాబాదు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. మండల దక్షిణ సరిహద్దు గుండా గోదావరి నది ప్రవహిస్తోంది. రాజకీయాలు: దిలావర్ పూర్ మండలము నిర్మల్ అసెంబ్లీ నియోజకవర్గం, ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉంది. ఆదిలాబాదు జిల్లా డిసిసిబి అధ్యక్షుడిగా పనిచేసిన పి.రమేష్ రెడ్డి దిలావర్‌పూర్ గ్రామానికి చెందినవారు.
దిలావర్‌పూర్ మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Bansapalli, Dilawarpur, Gundampalli, Kadili, Kalwa, Kanjar, Lingampalli, Malegaon, Mallapur, Mayapur, New Lolam RC, Rantapur K, Samunderpalli, Sangvi, Sirgapur
ప్రముఖ గ్రామాలు
దిలావర్‌పూర్ (Dilawarpur): దిలావర్‌పూర్ నిర్మల్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. ఇక్కడ పురాతనకాలం నాటి శ్రీ ఏకనాథస్వామి దేవాలయం ఉంది. ఎల్లమ్మదేవి మందిరం ప్రసిద్ధి చెందినది. ప్రక్కనే కల టెంబూర్ని, గుడంపల్లి గ్రామాలలో చారిత్రక ప్రాధాన్యం కల చిన్న బురుజులు, గడీలు ఉన్నాయి. కదిలి (Kadili): కదిలి నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ పాపహరేశ్వర క్షేత్రం ఉంది. పరశురాముడు తన తండ్రి జమదగ్ని మహర్షి ఆదేశం మేరకు తల్లి రేణుక తలను నరికివేశాడు. తర్వాత మాతృహత్య పాతకానికి ఒడిగట్టునని పరమశివుని కోసం ఘోరతపస్సు చేసి 32 శివలింగాలను ప్రతిష్టిస్తానని పాపవిమోచన కావాలని శివుడిని వేడుకున్నాడు. అందులో చివరి (32)వ లింగం ఇక్కడ ప్రతిష్టించినప్పుడు శివుడు లింగంలో కదిలినట్లు దీనితో దీనికి కలిలె అని క్రమంగా కదిలి పేరు స్థిరమైందని స్థలపురాణం వివరిస్తుంది. ఇక్కడ వెలిసిన ఆలయమే పాపహరేశ్వరాలయం. ఈ వృక్షంపై వెయ్యేళ్ళ వయసున్న నాగుపాము అమావాస్య, పౌర్ణమి రోజులలో దర్శనమిస్తుందని చెబుతారు. కాల్వ (Kalwa): కాల్వ నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలమునకు చెందిన గ్రామము. ఇక్కడ 13వ శతాబ్దిలో కాకతీయుల కాలంలో నిర్మించిన శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. సాంగ్వి (Sangwi): సాంగ్వి నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలమునకు చెందిన గ్రామము. ఈ గ్రామానికి చెందిన సంగెం నాగభూషన్ రావు ధర్మదాతగా పేరుగాంచారు. సాంగ్వి పాత గ్రామం పోచంపాడు ప్రాజెక్టులో కలిసింది. న్యూసాంగ్వి గ్రామం మామడ మండల పరిధిలో ఉంది. 2015 గోదావరి పుష్కరాల సమయంలోఇక్కడ వద్ద పుష్కరఘాట్ ఏర్పాటుచేశారు. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Dilawarpur or Dilavarpur Mandal, Nirmal Dist (district) Mandal in telugu, Nirmal Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి