కర్నూలు నగరము తుంగభద్ర తీరాన ఉన్న నగరము మరియు కర్నూలు జిల్లా పాలన కేంద్రము. హైదరాబాదు నుండి దక్షిణంగా 212 కి.మీ దూరంలో ఉన్న ఈ నగరం 1953-56 కాలంలో ఆంధ్రరాష్ట్ర రాజధానిగా కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ లోని అత్యధిక జనాభా గల నగరాలలో కర్నూలు ఏడవ స్థానములో ఉన్నది. ఒకప్పుడు కందెనవోలు గా ప్రసిద్ధి చెందిన పట్టణం ఇప్పుడు కర్నూలుగా మారింది. విజయనగర రాజు అత్యుతరాయలు నిర్మించిన కొండారెడ్డి బురుజు నగరం నడిబొడ్డున దర్శనమిస్తుంది.
చరిత్ర: ఇప్పుడు కర్నూలుగా పిలువబడే ఈ నగరం పూర్వ నామం కందెనవోలు. 11వ శతాబ్దిలో ఆలంపూరులో కడుతున్న ఆలయం కోసం బళ్ల మీద రాళ్లను తరలించే క్రమంలో, ఈ ప్రాంతంలో నదిలోకి బళ్లు దిగేముందు బండి చక్రాలకు కందెన రాయడానికి ఆపేవారట. దీని వల్ల ఈ ప్రాంతానికి కందెనవోలు అనే పేరు వచ్చింది. అదే రానురాను కర్నూలుగా రూపాంతరం చెందింది. కందెన రాయించుకునే ఈ ప్రదేశం పేరు బండ్ల మెట్ట. కాగా ఇప్పటికీ బండి మెట్ట అనబడు ప్రదేశం పాత నగరంలో కలదు. విజయనగర సామ్రాజ్యం పతనాంతరం ఈ ప్రాంతం బీజాపూరు సుల్తాను యొక్క అధీనంలో ఉండేది. మొగలు సామ్రాజ్యపు చివరి వాడైన ఔరంగజేబు 1687 లో దక్కన్ పీఠభూమిని ఆక్రమించి ఆంధ్రకు చెందిన హైదరాబాదు మరియు కర్నూలును నిజాంకు అప్పగించాడు. హైదరాబాదు నిజాం, కర్నూలు నవాబు లిరువురూ స్వతంత్ర్యులు గా తమ రాజ్యాలని ఏలుకున్నారు. అలఫ్ ఖాన్ బహదూర్ అనబడే నవాబు కర్నూలు యొక్క మొట్ట మొదటి పరిపాలకుడు కాగా, అతని వంశీకులు 200 ఏళ్ళు కర్నూలు ని పరిపాలించారు. 18 వ శతాబ్దపు ప్రారంభంలోనే మైసూరు సుల్తానులతో చేతులు కలిపి బ్రిటీషు రాజ్యం పై యుద్ధం చేశారు. రవాణా సౌకర్యాలు: దేశంలోనే పొడవైన జాతీయ రహదారి (44వ నెంబరు) కర్నూలు నగరం గుండా వెళ్ళుచున్నది. కర్నూలు నుంచి చిత్తూరు వరకు మరో జాతీయ రహదారి ఉన్నది. ఇవి కాకుండా కర్నులు నుంచి జిల్లాలోని ప్రముఖ పట్టణాలకు రహదారులున్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాదు నుంచి డోన్ వెళ్ళు రైలుమార్గం కర్నూలు మీదుగా వెళ్ళుచున్నది. జనాభా: 2011 లెక్కల ప్రకారం కర్నూలు నగర జనాభా 4,24,920. ఇందులో పురుషులు 2,11,875 మహిళలు 2,13,045. కర్నూలు మెట్రోపాలిటన్ ప్రాంతం జనాభా 4,78,124. నగర అక్షరాస్యత శాతం 78.15%. ఇవి కూడా చూడండి:
= = = = =
|
27, అక్టోబర్ 2013, ఆదివారం
కర్నూలు (Kurnool)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి