24, మార్చి 2014, సోమవారం

మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం (Malkajgiri Assembly Conctituency)

మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ సెగ్మెంట్ మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఇది కొత్తగా ఏర్పడింది. 2014 ఎన్నికలలో తెరాస పార్టీ అభ్యర్థి కనకారెడ్డి  ఇక్కడి నుంచి విజయం సాధించారు.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన ఈ నియోజకవర్గం ప్రకారం పరిధిలో మల్కాజ్‌గిరి మండలం ఒక్కటే కలదు.
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 ఆకుల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ కనకారెడ్డి ప్రజారాజ్యం పార్టీ
2014 కనకారెడ్డి తెరాస రామచంద్రారావు భాజపా


2009 ఎన్నికలు:
2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకుల రాజేందర్ తన సమీప ప్రత్యర్థి, ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి అయిన కనకారెడ్డిపై 9195 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. మాజీ పురపాలక సంఘం చైర్‌పర్సన్ వి.కె.శారద తెలుగుదేశం పార్టీ తరఫున, బాలలింగం భారతీయ జనతా పార్టీ తరఫున పోటీచేశారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన కనకారెడ్డి తన సమీప ప్రత్యర్థి, భారతీయ జనతాపార్టీకి చెందిన రామచంద్రారావుపై 2680 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ భాజపాకు మద్దతు ఇచ్చింది.


విభాగాలు: రంగారెడ్డి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం, మల్కాజ్‌గిరి అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక