24, మార్చి 2014, సోమవారం

మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం (Medchal Assembly Constituency)

మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజవర్గంలో 4 మండలాలు కలవు. ఈ సెగ్మెంట్ మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గంలో భాగముగా ఉన్నది. 2014 ఎన్నికలలో తెరాస పార్టీ అభ్యర్థి సుధీర్ రెడ్డి   ఇక్కడి నుంచి విజయం సాధించారు.

నియోజకవర్గ పరిధిలోని మండలాలు:
2009 నియోజకవర్గాల పునర్విభజన ఈ నియోజకవర్గం ప్రకారం పరిధిలో 4 మండలాలు కలవు.
  • మేడ్చల్,
  • షామీర్‌పేట్‌,
  • ఘటకేసర్,
  • కీసర,
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 వందేమాతరం  రామచంద్రారావు ఇండిపెండెంట్ కె.వి.రంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ
1967 సుమిత్రాదేవి కాంగ్రెస్ పార్టీ కె.ఆర్.అబ్బయ్య ఇండిపెండెంట్
1972 సుమిత్రాదేవి కాంగ్రెస్ పార్టీ వి.ప్రకాష్ సీపీఎం
1978 మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ టి.మోహన్ రెడ్డి జనతా పార్టీ
1983 ఉమా వెంకట్రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ టి.పి.రెడ్డి తెలుగుదేశం పార్టీ
1985 కె.సురేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ జి.సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ
1989 ఉమా వెంకట్రాంరెడ్డి కాంగ్రెస్ పార్టీ కె.సురేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
1994 తూళ్ళ దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీ ఎస్.ఉమాదేవి కాంగ్రెస్ పార్టీ
1999 తూళ్ళ దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీ ఎస్.హరివర్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2004 తూళ్ళ దేవేందర్ గౌడ్ తెలుగుదేశం పార్టీ కె.ఆర్.సురేందర్ రెడ్డి తెరాస
2009 కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్.ప్రభాకర్ గౌడ్ తెలుగుదేశం పార్టీ
2014 సుధీర్ రెడ్డి తెరాస కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ

2004 ఎన్నికలు:
2004 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన టి.దేవేందర్ గౌడ్ తన సమీప ప్రత్యర్థి, తెలంగాణా రాష్ట్ర సమితి అభ్యర్థి అయిన కె.ఆర్.సురేందర్ రెడ్డిపై 25707 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. దేవేందర్ గౌడ్‌కు 172916 ఓట్లు లభించగా, సురేందర్ రెడ్డికి 147209 ఓట్లు పోలయ్యాయి.

2009 ఎన్నికలు:
2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, శామీర్‌పేట్ జడ్పీటీసి సభ్యుడైన ఎన్.ప్రభాకర్ గౌడ్ పై 5525 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన సుధీర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే అయిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిపై 43158 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించారు.


విభాగాలు: రంగారెడ్డి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, మల్కాజ్‌గిరి లోకసభ నియోజకవర్గం, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక